Kantara: Chapter 1 Movie: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1′ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. హిట్ టాక్‌తో బాక్సాఫీసు కలెక్షన్ల ఊచకోత చూపిస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ అదే జోరుతో ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. కన్నడ ప్రాంతీయ చిత్రమైన ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడులైన సంగతి తెలిసిందే.
ఇందులో కన్నడ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్కి చెందిన నటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. హిందీ నటుడు గుల్షన్ దేవయ్య మెయిన్ విలన్ రోల్ పోషించాడు. ఇందులో తనదైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు. కాంతారలో ప్రముఖ పాత్రలన్నింటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తెలుగులో కాంతార: చాప్టర్ 1కి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తుంది. ఇందులో పాత్రల వాయిస్లు తెలుగు ఆడియన్స్కి బాగా సుపరిచితం అన్నట్టుగా ఉన్నాయి. దీంతో ఇందులో ముఖ్యపాత్రలకు డబ్బింగ్ చెప్పింది ఎవరా అని అంత ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నటుడు జయరాంకు మహేష్ బాబు ‘అతడు‘, పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ మూవీ టైటిల్ సాంగ్ రాసి పాడిన గేయ రచయిత, సింగర్ విశ్వ డబ్బింగ్ చెప్పారట.
ఇక విలన్ రోల్ పోషించిన హిందీ నటుడు గుల్షన్ దేవయ్య పాత్రకు ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ వాయిస్ ఇచ్చారట. అతడు మరెవరో కాదు ఆర్జే సూర్య. బిగ్ బాస్ 6వ సీజన్తో ఆర్జే సూర్య మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అయిన సూర్య.. మిమిక్రీ ఆర్టిస్టు అనే విషయం తెలిసిందే. ప్రముఖ హీరోల వాయిస్ని ఇమిమేట్ చేసి హౌజ్లో అలరించాడు. అతడి వాయిస్కి మంచి క్రేజ్ ఉంది. దీంతో కాంతార: చాప్టర్ 1లో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఛాన్స్ కొట్టేశాడు. మూవీలో కీలక పాత్ర పోషించిన గుల్షన్ దేవయ్య తెలుగులో ఆర్జే సూర్య డబ్బింగ్ చెప్పాడట. ఇక సినిమాలో తనదైన కామెడీతో నవ్వించిన షార్ట్ మ్యాన్‌కి ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్ బబ్లూ చెప్పాడట. ఇక సినిమా ఓ వాయిస్ ఓవర్‌తో సాగిన సంగతి తెలిసిందే. ఓ చిన్నపిల్లాడికి కథ చెప్పే వ్యక్తి పాత్రకు లక్ష్మణ్ మిసాలా వాయిస్ ఇచ్చారట. ఈయన మంగళవారం చిత్రంలో అంధుడి పాత్రలో నటించాడు.
Also Read: Naga Chaitanya: నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలి.. అదే నా కల
కేజీయఫ్లోనూ ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పిన లక్ష్మణ్ మిసాలా.. కాంతారలోనూ అతడికి డబ్బింగ్ చెప్పాడట. 2022లో వచ్చిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. మొదట ప్రాంతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడలో ఊహించని రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ్లో విడుదల చేయగా.. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ. 16 కోట్ల తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్ చేసిన ఈసినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్ 1ని తెరకెక్కించి 2025 దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు సాధించడం విశేషం.