Rabies: తెలుగు రాష్ట్రాల్లో రేబిస్ మరణాల భయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే రేబిస్ వ్యాధితో చాలా మంది చనిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక చిన్నారి మృతి చెందాడు.
హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో మరో బాలుడు మృతి..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన మైదం శ్రీనివాస్ అనే వ్యక్తి, బతుకుమీద ఆశలు పెట్టుకుని హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. అతని కుమారుడు శ్రీ చరణ్ (3-4), రెండు నెలల క్రితం వీధి కుక్క కాటుకు గురయ్యాడు. కానీ, కుటుంబ సభ్యులు దానిని తీవ్రంగా పట్టించుకోలేదు. ఇటీవల రెండు రోజుల క్రితం శ్రీ చరణ్‌కు ఊపిరి ఆడకపోవడం, జ్వరం, మానసిక ఆందోళన వంటి రేబిస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే తార్నాకలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది.
ఒక్క సంవత్సరంలోనే ఇన్ని మరణాలా..
2025లో ఇప్పటికే తెలంగాణలో రోజుకు 350కి పైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 2024లో దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్క కాటు కేసులు, 54 రేబిస్ మరణాలు నమోదయ్యాయి. అయితే, 2023లో 286 మంది మరణాలు జరిగాయి. ఒక్క తెలంగాణలోనే ఈ సంవత్సరం మొదటి 7 నెలల్లో 23 మంది రేబిస్ వల్ల మరణించారు.. వీటిలో చాలామంది వీధి కుక్కల కారణంగానే మరణించారని తెలిపారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో మూడేళ్ల బాలుడు, భద్రాద్రి కొత్తగూడెంలో యువకుడు వంటి మరిన్ని ఘటనలు జరిగాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
ప్రస్తుత కాలంలో వీధి కుక్కల సంఖ్య పెరగడం వల్ల వాక్సినేషన్ అవగహన లోపం లేకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేబిస్ ఔషధాల కొరత వల్ల కూడా మరణాల సంఖ్య పెరుగుతుంది. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల రేబిస్ వ్యాక్సిన్, ఇమ్యూన్ గ్లోబ్యులిన్‌లు కొరతగా ఉన్నాయి, దీంతో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లుతున్నారు. రేబిస్ వైరస్ ప్రధానంగా కుక్కల కాటు ద్వారా సోకుతుంది, ఒకసారి లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స దాదాపు అసాధ్యమంటున్నారు.
Also Read: ట్రబుల్‌కి.. ట్రిపుల్ ధమాకా! భారత్ జోలికొస్తే ఊచకోతే..
రేబిస్ వ్యాధి నివారణ..
అయితే కుక్క కాటు తగిలిన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో కడగాలి. అలాగే త్వరగా వైద్యుడు దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వం వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయడం, వాక్సినేట్ చేయడం మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రేబిస్ మరణాల భయం
హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో బాలుడు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్థిరపడిన మైదం శ్రీనివాస్ అనే వ్యక్తి
రెండు నెలల క్రితం కుక్కకాటుకు గురైన అతని కొడుకు శ్రీ చరణ్
అయితే,… pic.twitter.com/TyZ13pYvJz
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2025