BigTV English

Tollywood Hero’s: ఇండస్ట్రీలో మార్పు మొదలు.. మీరు కూడా గమనించారా..?

Tollywood Hero’s: ఇండస్ట్రీలో మార్పు మొదలు.. మీరు కూడా గమనించారా..?

Tollywood Hero’s.. మిగతా భాష ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. మూడు రోజులపాటు వరుసగా సెలవులు వస్తాయి. కాబట్టి ఈ హాలిడేస్ ని ఉపయోగించుకోవాలని దర్శక నిర్మాతలు, హీరోలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే ఎవరికి వారు పోటీగా ప్రచారాలు నిర్వహిస్తారు. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి అంటే అక్కడి పరిస్థితి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా ఒక సినిమాకి పోటీగా మరొక సినిమా అప్డేట్స్ ఇవ్వడం, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నిసార్లు హీరోల వల్ల కూడా పరిస్థితి మరింత వేడెక్కేది.


దీంతో ఏ హీరో సక్సెస్ సాధిస్తాడు అనే అనుమానాలు వ్యక్తం అయ్యేవి. ముఖ్యంగా అభిమానులు కూడా తమ హీరో గెలుస్తాడంటే, తమ హీరో సక్సెస్ అవుతాడంటూ కామెంట్లు చేసుకునేవాళ్లు. హీరోలు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండస్ట్రీలో మార్పులు వస్తున్నాయి. పోటీ వద్దు రాజీ ముద్దు అనే పదానికి నిర్వచనం గా మారిపోతున్నారు. ఒక హీరో సినిమా కోసం మరొక హీరో రంగంలోకి దిగడంతో అంతా ఫ్రెండ్లీ వెదర్ కనిపిస్తోందని చెప్పవచ్చు.

ఉదాహరణకు వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’, వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక మరొకవైపు బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొన్న నాలుగవ సీజన్ ఏడవ ఎపిసోడ్ కి వెంకటేష్ తన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి సందడి చేశారు. ఆ షో లో బాలకృష్ణ, వెంకటేష్ చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. సంక్రాంతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తుండగా.. ఇద్దరు కూడా మన మధ్య పోటీనా అంటూ వారి మధ్య ఒక ఫన్నీ చర్చ కూడా జరిగింది.


ఇక దీనికి తోడు సంక్రాంతి పోటీకి దిగుతున్న మరొక హీరో రామ్ చరణ్. ఈయన కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈరోజు సందడి చేశారు. రెండు సినిమాలు హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి అని బాలయ్య కూడా కామెంట్లు చేశారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల హీరోలు ఇలా ఫ్రెండ్లీగా కనిపించడంతో ఇండస్ట్రీలో మార్పు వస్తోంది అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇది ఒకరు చెప్పేది కాదని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ మాట అనక తప్పదు అని సినీ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మార్పు మంచిదే అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..మరి ఈ ఫ్రెండ్లీ నేచర్ ఇలాగే ఉంటుందా లేక మళ్ళీ ఎవరికి వారు అన్నట్టు ప్రవర్తిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏం జరిగినా హీరోలు ఇలా ఒకరికొకరు సపోర్టుగా నిలిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లచ్చని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×