BigTV English

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Hyderabad:ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతూ అటు భోజనప్రియులను ఇటు ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తాజాగా మాదాపూర్ లో కూడా “ది హౌస్ ఆఫ్ కోయిలా” పేరుతో ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు. తాజాగా ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హాజరయ్యి.. రెస్టారెంట్ ను ఘనంగా ప్రారంభించారు.


మాదాపూర్ లో ఘనంగా ది హౌస్ ఆఫ్ కోయిల రెస్టారెంట్ ప్రారంభం..

విషయంలోకి వెళ్తే మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 11 లో అలంగీర్ మసీదు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ది హౌస్ ఆఫ్ కోయిలా – కిచెన్, కెఫే అండ్ బేక్ హౌస్” ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు..

గ్రేటర్ సిటీలో ఫుడ్ హబ్..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. “హైదరాబాదులో ఫుడ్ లవర్స్ కోసం కిచెన్, కెఫే, బేక్ హౌస్ ను ఒకే చోట ఏర్పాటు చేయడం చాలా సౌలభ్యంగా ఉంది. విభిన్న రుచులకు ఫుడ్ హబ్ గా పేరున గ్రేటర్ సిటీలో ది హౌస్ ఆఫ్ కోయిలా అందుబాటులోకి రావడం అభినందనీయం..”అంటూ తెలిపారు.


ది హౌస్ ఆఫ్ కోయిల ప్రత్యేకతలు..

అలాగే ది హౌస్ ఆఫ్ కోయిలా డైరెక్టర్ పి రేవతి మాట్లాడుతూ.. “మాంసాహారం, శాకాహార దక్షిణ భారత వంటకాలతో పాటు పేస్ట్రీ , పిజ్జాలు, తాజా బ్రెడ్లు, ఆర్టీసనల్ కాఫీలు, ఐస్క్రీమ్లు, డిజర్ట్ లు, కేకులు ఇంకెన్నో ఇక్కడి ప్రత్యేకం.. కార్పొరేట్ లంచులకు, పార్టీ ఆర్డర్లు, ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఫుడ్ ఎక్స్పీరియన్స్ లు కూడా ఇక్కడ లభిస్తాయి అంటూ ఆమె స్పష్టం చేశారు.

మొత్తానికి అయితే ఇలాంటి వినూత్నమైన వంటకాలతో అద్భుతమైన రుచులను అందించే దిశగా ఈ రెస్టారెంట్ ముందడుగు వేస్తోంది అంటూ నిర్వహకులు స్పష్టం చేశారు.

ALSO READ:Director Sukumar: హైదరాబాదులో సుకుమార్ సందడి.. ఘనంగా ప్రారంభోత్సవం!

Related News

Walk With Friend: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Velaterapia: జుట్టుకు మంటలు.. ఇదేం మాయదారి ట్రెండ్ రా? ఇది ఏ దేశంలో మొదలైందో తెలుసా?

Director Sukumar: హైదరాబాదులో సుకుమార్ సందడి.. ఘనంగా ప్రారంభోత్సవం!

Cetirizine: సెటిరిజిన్ మాత్ర తీసుకుంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఇది సేఫేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

Glow Skin In One Day: ఇవి వాడితే.. ఒక్క రోజులోనే గ్లోయింగ్ స్కిన్

Blood Sugar: ఏంటీ.. టూత్ పేస్ట్‌‌తో షుగర్ పెరుగుతుందా ?

Big Stories

×