Naga Chaitanya: నాగచైతన్య (Naga Chaitanya) అక్కినేని ఫ్యామిలీ అనే బడా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాత, తండ్రి ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. అలా వీరి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకు కొద్ది రోజుల వరకు అన్ని ఫ్లాప్ సినిమాలే ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆయన్ని నటుడిగా నిలబెట్టాయి. అయితే అలాంటి నాగచైతన్య తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని ఎంత ప్రయత్నించినా దాని నుంచి తప్పించుకోలేకపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ నాగచైతన్య మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి..? ఆయన దేని నుండి తప్పించుకోవాలని చూశారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నాగచైతన్య తాజాగా జగపతిబాబు (Jagapathi Babu) హోస్టుగా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischeyammura) అనే టాక్ షో లో సందడి చేశారు. ఈ షోలో మాట్లాడిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా దాని నుండి తప్పించుకోవాలని ఎంత ట్రై చేసినా కూడా దొరికిపోయాను అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. నాగచైతన్య మాట్లాడిన మాటలు దేని గురించి అంటే.. మహానటి (Mahanati) సినిమాలో ఏఎన్ఆర్ పాత్ర గురించి.
సావిత్రి(Savitri) బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీలో ఏఎన్ఆర్ (ANR) పాత్రలో నాగచైతన్య నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం డైరెక్టర్ తన కోసం వెతుకుతున్న సమయంలో.. చైతూ ఈ పాత్రలో చేయకూడదని చాలా సార్లు తప్పించుకొని తిరిగారట. కానీ ఫైనల్ గా తాత గారి పాత్ర చేయకుండా తప్పించుకోలేకపోయారట.
ఎందుకంటే నాగ్ అశ్విన్ (Nag Ashwin) నాగేశ్వరరావు పాత్రలో మీరైతేనే కరెక్ట్ గా సెట్ అవుతారని తెలిపారట. దాంతో ఫైనల్ గా ఏఎన్ఆర్ పాత్ర చేయడం కోసం నాగచైతన్య ఒప్పుకున్నారట. ఈ విషయం గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. తాత గారి పాత్ర నుండి తప్పించుకోవాలని చూసినా కుదరలేదు. కానీ ఈ పాత్రలో చేయడం వల్లే నాకు మంచి గుర్తింపు వచ్చింది.కొన్ని కొన్ని పాత్రలు అప్పుడప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే తాతగారి పాత్రలో చేసి ట్రిబ్యూట్ అందించాను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు నాగచైతన్య..
అలాగే నాన్న నాగార్జున(Nagarjuna)తో కలిసి వర్క్ చేయడం చాలా కష్టం అని కూడా తెలిపారు. నాగార్జున తో కలిసి నాగచైతన్య బంగార్రాజు (Bangarraju), మనం (Manam) వంటి సినిమాలు చేశారు చైతూ.
నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..ఆయన మొదట సమంత (Samantha) ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipalla)ని గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో NC24 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
also read: Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!