Janu lyri- Deelip Devagan: జాను లిరి(Janu Lyri) పరిచయం అవసరం లేని పేరు. ఫోక్ డాన్సర్ (Folk Dancer) గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల కాలంలో తరచూ తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి జాను లిరిక్ ఇది వరకే కిక్ టోనీ (Kick Tony)అనే ఒక ఫోక్ డాన్సర్ ను ప్రేమించే వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే తన భర్తతో వచ్చిన వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా జాను లిరిక్ విడాకులు తీసుకొని విడిపోయారు. తన భర్త నుంచి దూరంగా ఉన్న ఈమె పెద్ద ఎత్తున డాన్స్ షో కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే స్పెషల్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. అయితే జాను గురించి కూడా ఎన్నో రూమర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈమె తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు తాను దిలీప్ దేవగన్ (Deelip Devagan)అనే మరొక డాన్సర్ తో రిలేషన్ లో ఉన్నానని త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అంటు స్వయంగా జాను తెలియజేయడంతో వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే తరుణంలోనే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసే కొటేషన్లు అలాగే దిలీప్ నేను ప్రేమించి తప్పు చేశా అంటూ మాట్లాడిన వీడియోలు బయటకు రావడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని అందరూ భావించారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు జాను ఎక్కడ స్పందించక పోయిన తాజాగా దిలీప్ బ్రేకప్ రూమర్లపై స్పందించారు. ప్రతి ఒక్కరి జీవితంలోను లవ్ అనేది ఉంటుంది అయితే మేము సెలబ్రిటీలం కాబట్టి నలుగురికి తెలుసు కాబట్టి మా గురించి ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయని తెలిపారు..
ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది..
సోషల్ మీడియాలో మా బ్రేకప్ గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అంటూ దిలీప్ దేవగన్ వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో మీ గురించి వచ్చే ట్రోల్స్ కి మీసమాధానం ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు దిలీప్ సమాధానం చెబుతూ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుందని మా పని మేము చేస్తుంటాము ట్రోలర్స్ వాళ్ల పని వాళ్లు చేస్తారు అంటూ సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, ఇద్దరు మద్య ఎలాంటి గొడవలు లేవని బ్రేకప్ వార్తలు కేవలం రూమర్లు మాత్రమే అంటూ దిలీప్ దేవగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ బ్రేకప్ వార్తలపై జాను స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Dadasaheb Phalke Biopic: ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయినట్టేనా.. జక్కన్న కీలక నిర్ణయం!