Fire Accident: హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో కారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రమంజిల్ మెట్రో సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కారులో ఒక్కసారిగా మంటల చెలరేగిన వెంటనే పెట్రోల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను వెంటనే ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
ఎర్రమంజిల్ మెట్రో సమీపంలో ఉన్న బంక్ వద్దకు పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ కారు వచ్చింది. అయితే ఏం జరిగిందో..? ఎంటో తెలియదు కానీ.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తమ వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్ టింగ్విషర్ లు)ను ఉపయోగించి మంటలనే ఆర్పే ప్రయత్నం చేశారు.
ALSO READ: RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
చాకచక్యంగా వ్యవహరించిన బంక్ సిబ్బంది..
పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. మంటలు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించారు. పెట్రోల్ బంక్ ఉన్న ఇంధనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. అలాగే పక్కన వాహనాలకు కారు తాకుకుండా అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. దీంతో పెట్రోల్ పంపులో భారీ ప్రమాదం తప్పింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: iphone 17 Discount: ఐఫోన్ 17పై తొలిసారి డిస్కౌంట్.. తక్కువ ధరలో తాజా ఫ్లాగ్‌షిప్.. ఎక్కడంటే?
ఇంజిన్ వేడెక్కడంతో ప్రమాదం..?
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు. మంటలను పూర్తి ఆర్పి వేసినప్పటికీ కారు మాత్రం కొంత డ్యామేజ్ అయ్యింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా సాంకేతిక లోపం లేదా ఇంజిన్ వేడెక్కడం వంటివి ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట వంటి రద్దీ ప్రాంతంలో ఈ సంఘటన జరగడం, కానీ సిబ్బంది సమయానికి స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.