Mrunal Thakur Latest Photos: మోడల్‌గా, సీరియల్ యాక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో కష్టపడి కెరీర్‌ను ముందుకు నడిపించిన మృణాల్ ఠాకూర్ జీవితాన్ని ఒక్క సినిమా పూర్తిగా మార్చేసింది. అదే ‘సీతారామం’. (Image Source: Mrunal Thakur/Instagram)
హిందీలో హీరోయిన్‌గా దాదాపు అరడజను సినిమాల్లో నటించిన తర్వాత ‘సీతారామం’తో తెలుగులో డెబ్యూ చేసే అవకాశం దక్కించుకుంది మృణాల్. (Image Source: Mrunal Thakur/Instagram)
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’.. మృణాల్ ఠాకూర్‌ను వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. తన కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. (Image Source: Mrunal Thakur/Instagram)
ఇప్పటికీ ఫ్యాన్స్ అంతా తనను ‘సీతారామం’లో సీతగానే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆన్ స్క్రీన్ సీతకు, ఆఫ్ స్క్రీన్ మృణాల్‌కు చాలా తేడా ఉంది. (Image Source: Mrunal Thakur/Instagram)
మృణాల్ ఠాకూర్ ఎక్కువగా మోడర్న్‌గా ఉండడానికే ప్రిఫర్ చేస్తుంది. తన ట్రెడీషినల్ వేర్‌లో కూడా ఒక మోడర్న్ టచ్ ఉంటుంది. (Image Source: Mrunal Thakur/Instagram)
తాజాగా ఒక దీపావళి పార్టీకి హాజరయ్యింది మృణాల్ ఠాకూర్. దానికోసం యెల్లో కలర్ షరారాలో ముస్తాబయ్యింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Mrunal Thakur/Instagram)
యెల్లో కలర్ షరారాలో మృణాల్ చాలా క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ ప్రశంసించారు. అయితే ఈ ఫోటోల్లో తను షార్ట్ హెయిర్‌లో కనిపించడంతో ఈ లుక్ కూడా తనకు బాగుందని అన్నారు. (Image Source: Mrunal Thakur/Instagram)
ప్రేమతో మీ మృణాల్ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది మృణాల్ ఠాకూర్. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ ఫోటోలకు తెగ లైకులు కొట్టేస్తున్నారు. (Image Source: Mrunal Thakur/Instagram)
ఇక సినిమాల విషయానికొస్తే.. మృణాల్ ఠాకూర్ చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’లో నటించింది. ఈ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది. (Image Source: Mrunal Thakur/Instagram)
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. వరుసగా నాలుగు హిందీ చిత్రాలతో బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. (Image Source: Mrunal Thakur/Instagram)