Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా సౌత్ క్వీన్ సమంత (Samantha)ను పెళ్లాడి విడాకులు ఇచ్చిన చై ఇప్పుడు మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ (Shobhita Dhulipala)ను పెళ్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శోభిత కోసం సమంతతో ఉన్న చివరి మెమొరీని కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది.
2021లో సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య (Naga Chaitanya) ఆ తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే రీసెంట్ గా ఈ స్టార్ కపుల్ ప్రైవేట్ ఈవెంట్ లో కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం శోభిత ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది మొదట్లోనే నాగచైతన్య శోభిత జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే వార్త వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే పెళ్లి కంటే ముందే నాగ చైతన్య (Naga Chaitanya).. సమంతతో తనకున్న జ్ఞాపకాలను చెరిపేస్తున్నాడు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియాలో సమంతతో కలిసి ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సమంతతో తాను కలిసి ఉన్న ఫోటోను తొలగించినట్టు సమాచారం. గతంలో సమంతతో కలిసి కార్ రేసింగ్ లో పాల్గొన్న నాగ చైతన్య ‘త్రో బ్యాక్.. మిస్సెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్’ అంటూ అప్పట్లో ఒక ఫోటోను షేర్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఫోటో చైతు టైం లైన్ లో కనిపించకపోవడంతో ఈ ఫోటోను శోభిత తన లైఫ్ లోకి రావడానికంటే ముందే నాగ చైతన్య తొలగించినట్టు తెలుస్తోంది. రెండో పెళ్లికి ముందే సమంతతో తనకు ఉన్న అన్ని జ్ఞాపకాలను చైతూ ఇలా దూరం చేసుకుంటున్నారు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కాగా తాజాగా చైతు డిలీట్ చేసిన సమంత ఫోటోను సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేసి వైరల్ చేయడంతో శోభిత కోసం నాగ చైతన్య (Naga Chaitanya) ఆ ఫోటోను డిలీట్ చేశాడు అనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఏఎన్ఆర్ అవార్డుల వేడుకలో శోబిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఈవెంట్ లో అక్కినేని నాగ చైతన్యతో కలిసి పెళ్లికి ముందే అక్కినేని ఇంటి పెద్ద కోడలుగా హోదాను సంపాదించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది నాగ చైతన్యకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సమంత ‘సిటాడెల్ : హనీ బన్నీ’ అనే సిరీస్ తో చాలా కాలం తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.