BigTV English

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

Apple Intelligence : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా

Apple Intelligence : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్… తాజాగా iPhone, iPad, Mac Books కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న AI సాధనం Apple ఇంటిలిజెన్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆపిల్ ఇంటిలిజెన్స్ మీ ఐఫోన్స్ లో పనిచేస్తుందా.. లేదా.. అసలు ఏ ఫోన్స్ కు ఈ ఫీచర్ వర్క్ అవుతుందో తెలుసుకోండిలా.


ఈ ఏడాది జూన్‌లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కమ్యూనిటీలో Apple ఇంటెలిజెన్స్‌ ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ ప్రకటించింది. రైటింగ్ టూల్స్, ప్రైవసీ, ఇంప్రూవ్డ్ సిరి, ఆర్గనైజ్డ్ నోటిఫికేషన్స్, కాల్ రికార్డింగ్‌తో సహా కొత్త ఫీచర్స్ ను అందిస్తుందని తెలిపింది. వీటితో పాటు వినికిడి లోపంతో బాధపడుతున్న వారికోసం iOS 18.1తో స్పెషల్ ఫీచర్ ను సైతం తీసుకువచ్చింది. AirPods ప్రో మెరుగైన వినికిడి అనుభవాన్ని పొందవచ్చని తెలిపిన ఆపిల్.. ఈ ఫీచర్ ప్రస్తుతం భారత్ లో అందుబాటులో లేదని తెలిపింది. ఇక ఈ ఫీచర్ ఏ ఆపిల్ ప్రొడెక్ట్స్ లో పనిచేస్తుందంటే..

సపోర్ట్ చేసే ఆపిల్ గ్యాడ్జెట్స్ –


iPhone 16
iPhone 16 Plus
iPhone 16 Pro
iPhone 16 Pro Max
iPhone 15 Pro
iPhone 15 Pro Max
iPad mini (A17 Pro)
iPad and Mac models with M1 and later మోడల్స్ కు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ లో బెస్ట్ ఫీచర్స్ –
రైటింగ్ టూల్స్

Apple ఇంటెలిజెన్స్ స్పెషల్ ఫీచర్స్ లో రైటింగ్ టూల్ ఒకటి. మెరుగైన భాషా సామర్థ్యాలతో రాయటానికి ది బెస్ట్ ఫీచర్ గా ఇది వర్క్ చేస్తుంది. మొత్తం ఆర్టికల్ లేదా రీసెర్చ్ పేపర్‌ను సెకన్లలో అర్ధచేసుకుని కావలసిన డేటాను అందిస్తుంది.

న్యూ సిరి –

సిరిలో కొత్త ఫీచర్స్ ను ఆపిల్ ఇంటిలిజెన్స్ అందిస్తుంది. కొత్త డిజైన్‌తో, స్క్రీన్ చుట్టూ లైటింగ్ తో లాంఛ్ చేసిన ఈ ఫీచర్ లో బెస్ట్ లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నాయి. కాంతితో రిచ్ లాంగ్వేజ్ అవగాహనతో ప్రారంభించబడింది. ఈ ఫీచర్ సహాయంతో iPhone, iPad, Macలో ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.

ప్రైవసీ –

Apple ఇంటెలిజెన్స్ iPhone, iPad, Mac కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Apple ఇంటెలిజెన్స్‌లోని ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ సిస్టమ్ డేటాను స్టోర్ చేయదు. కేవలం అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఉపయోగిస్తుంది. దీంతో మరింత సెక్యూరిటీను యూజర్ కు అందిస్తుంది.

iOS 18, iPadOS 18, macOS Sequoia అప్‌డేట్స్ లో భాగంగా Apple ఇంటెలిజెన్స్ US ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ఇక ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, UK ఇంగ్లీష్ లో కూడా అందుబాటులోకి తీసుకవస్తున్నామని… ఇంగ్లీష్ ఇండియా, సింగపూర్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్, స్పానిష్, వియత్నామీస్ తో పాటు ఇతర భాషలకు వచ్చే ఏడాది నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది.

ALSO READ :  ఇచ్చిపడేశాడు బ్రో.. రూ.6999కే 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ సహా ఇంకా ఎన్నో

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×