Raashii Khanna Latest Photos: రాశీ ఖన్నా.. బొద్దుగా, ముద్దుగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళాడుతూ ఉండే ఆమె “ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
జిల్ సినిమాతో వెండితెరపై జిగేల్ మనిపించింది. ఆ తర్వాత వరుస ఛాన్స్‌లతో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
“శ్రీనివాస కళ్యాణం” సినిమాతో తెలుగు సాంప్రదాయాలను గుర్తుచేసింది. టాలీవుడ్‌లో నటించే హీరోయిన్స్‌లలో తెలుగులో మాట్లాడేవారిలో రాశీ ఖన్నా ఒకరు.
ఇక ఈ అమ్మడు నటి మాత్రమే కాదు సింగర్ కూడా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.
రాశీ ఖన్నా 2013లో “మద్రాస్ కేఫ్” అనే మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.
తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివం, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవ కుశ, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, తొలిప్రేమ, తెలుసు కదా, తదితర చిత్రాల్లో నటించింది.
రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా రాశీఖన్నా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.