AP Crime: యువత చదువును పక్కన పెట్టి జులాయిగా తిరుగుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చదువుకుని ఉద్యోగాలు చేయాల్సిన వయసులో చెడు తిరుగుళ్లు తిరుగుతూ నేరస్తులుగా మారుతున్నారు. కొట్లాటలకు వెళ్లడం, మత్తులో మునిగితేలడం ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. దీంతో చివరికి జైలులో ఊసలు లెక్కపెడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ యువకుడిని ముగ్గురు యువకులు దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.
Also read: తమిళ చిత్ర సీమ షాకింగ్ డెసిషన్… ఇకపై రివ్యూవర్లకు ఆ ఛాన్స్ లేదు
ఓ అమ్మాయికి సందేశాలు పంపుతున్నాడనే కారణంతో ఊరిచివరలో ముగ్గురు యువకులు మరో యువకుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని మలికిపురంలో చోటు చేసుకుంది. అమ్మాయికి ఎందుకు సందేశాలు పంపావంటూ మందుబాటిల్స్, కొబ్బిరిమట్టతో దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు దాడిలో యువకుడికి గాయాలు కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దాడి చేసి వెళుతుండా కొట్టిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కర్మ వదిలిపెట్టలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు ఖర్మ వచ్చే జన్మలోనో.. ఇంకెప్పుడో వెంటాడేదని కానీ ఇప్పుడు ఇదే జన్మలో ఖర్మ వదిలిపెట్టడంలేదని అభిప్రాయపడుతున్నారు.