Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
గీత గోవిందం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ, వెనుదిరిగి చూడలేదు.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యింది. ఒకానొక దశలో మ్యారేజ్ అంచుల వరకు వెళ్లింది ఈ సుందరి.
గీత గోవిందం మూవీ ఆమెకి కొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక పుష్ప సినిమా గురించి చెప్పనక్కర్లేదు.
దేశవ్యాప్తంగా తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకుంది. సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెట్టుకుంది ఈ అమ్మడు.
సౌత్ నుంచి నేరుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ఆలోచన చేస్తోంది.
పుష్ప సీక్వెల్ హిట్టయితే బాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది.
ఈ విషయంలో కాసింత టెన్షన్ పడుతోందట రష్మిక. వచ్చే ఏడాది కూడా ఇయర్ చార్ట్ ను ఫుల్ చేసుకునే పనిలో పడింది.
షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్ వద్ద శారీతో కాసింత స్పైసీగా కనిపించింది. వెంటనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకు పని చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.