Gundeninda Gudigantalu Prabhavathi : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్ ప్రసారమైన కొద్ది రోజుల్లోనే టాప్ రేటింగ్ తో పాటుగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఆశలు అత్యాశలు ఎక్కువ అని ఈ సీరియల్స్ స్టోరీ చూపిస్తుంది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ గుండెనిండా గుడి గంటలు సీరియల్ ప్రసారం అవుతుంది.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఇది ఒకటి. ఇందులో డబ్బాశతో గొప్పలకు పోయే అత్త పాత్రలో అనీలా శ్రీకుమార్ నటించారు. హీరో హీరోయిన్ల కన్నా ఆమె పాత్ర హైలెట్ అని చెప్పాలి. ఈమె కేవలం నటిగా మాత్రమే కాదు డాన్సర్ అన్న సంగతి అతి కొద్ది మందికే తెలుసు. తాజాగా ఈమె డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
మలయాళ నటి అనీలా ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మలయాళ ఇండస్ట్రీలో వరుసగా హిట్ సీరియల్స్లలో ఆమె నటించారు. ఈ మధ్య టీవీ సీరియల్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. ఈమె కూడా తన కూతురు కొడుకుతో కలిసి సోషల్ మీడియాలో రిలీస్ చేస్తూ ఫేమస్ అవుతుంది. తాజాగా ఈమె తన కొడుకు కూతురుతో కలిసి వేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరితో పోటీపడి మరి ప్రభావతం మా డాన్స్ వేయడంతో తెలుగు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.. కూతురు తల్లిని మించిపోయిన అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. త్వరలోనే మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ కామెంట్లతో ఆ వీడియోని మరింత పాపులర్ అయ్యేలా చేస్తున్నారు. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో మీరు ఒకసారి చూసేయండి.
Also Read :గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..
ఈమె 1992లో మలయాళ మూవీ సర్గంతో ప్రారంభించింది . దీపాంగళ్ చుట్టుమ్ , ద్రౌపది , జ్వాలయాయి , గుండెనిండా గుడిగంటలు , కృష్ణతులసి, చిన్న తంబి వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించి, మలయాళ టెలివిజన్ నుంచి తెలుగులో బిజీ నటి అయ్యింది. ఈమె తెలుగులో ఇప్పటికీ రెండు మూడు సీరియల్స్ చేసింది.. అందులో ఇప్పుడు ప్రసారమవుతున్న గుండె మీద గుడి గంటలు సీరియల్ ఆమెకు మంచి పేరుని అందించింది. ఇకపోతే ఈమె నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం నటిస్తున్న గుండెనిండా గుడి గంటలకు ఈమె దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది.. ఈ లెక్కన చూస్తే సీరియల్ హీరోయిన్ లతో పాటుగా ఈమె అందుకుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకవైపు సీరియల్స్ లలో బిజీగా ఉన్నా మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది. తన పిల్లలతో కలిసి రియల్ చేస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది.