OTT Movie : అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ‘ది విచర్’ సీజన్ 4 సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫ్యాంటసీ ప్రియులకు ఇదొక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇది మరో కొత్త ప్రపంచంలో కి తీసుకెళ్తుంది. భూతాలు, దెయ్యాలు, మంత్రాలతో ఈ సిరీస్ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఇది వరకు వచ్చిన మూడు సీజన్లు ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఇది ఫాంటసీ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది విచర్’ (The witcher) సీజన్ 4 నెట్‌ఫ్లిక్స్‌లో 2025 అక్టోబర్ 30 ప్రీమియర్ అయిన ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఈ సీజన్‌లో హెన్రీ కావిల్ స్థానంలో లియామ్ హేమ్స్‌వర్త్ గెరాల్ట్ ఆఫ్ రివియా పాత్రను పోషించారు. సీజన్ 1: 2019, సీజన్ 2 : 2021, సీజన్ 3: 2023 లో వచ్చాయి. ఇప్పడు వచ్చిన నాలుగో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది.
సీజన్ 4 ప్రారంభంలోనే యెన్నిఫర్, జాస్కియర్ లతో కలిసి గెరాల్ట్ ప్రయాణిస్తాడు. సిరీ మాత్రం గత సీజన్‌లో గతం మర్చిపోయి దొంగల గ్యాంగ్ ‘ది ర్యాట్స్’తో చేరుతుంది. ఈ గ్యాంగ్ దోపిడీలు, హత్యలు చేస్తూ తిరుగుతారు. సిరీ తన పేరును ‘ఫాల్కా’ అని మార్చుకుని, తన శక్తుల గురించి మరిచిపోయి దొంగల జీవితం గడుపుతుంది. మరో వైపు యెన్నిఫర్ తన మ్యాజిక్ శక్తులు తిరిగి పొంది, అరేటూజా ద్వీపంలో కొత్త మ్యాజికల్ టౌన్ ‘కైర్ మోర్హెన్ 2.0’ని సృష్టిస్తుంది. ఇక్కడ ఆమె రెబెల్స్‌తో పోరాడుతుంది. గెరాల్ట్ ఒక రహస్య ఆయుధం ‘బుక్ ఆఫ్ ది ఎల్డర్ బ్లడ్’ని కనుగొంటాడు. ఇది సిరీ శక్తులను అన్‌లాక్ చేసే కీ. కానీ ఈ పుస్తకం ఇప్పుడు డెమన్ రూపంలో ఉండే ఒక రక్షసుడి దగ్గర ఉంటుంది. ఆ రక్షసుడిని ఎదుర్కునే క్రమంలో స్టోరీ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి గెరాల్ట్ ఆ బుక్ ని పొందుతాడా ? సిరి పవర్స్ ని వెనక్కి తెప్పిస్తాడా ? ఈ సీజన్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Read Also : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్