Kanchana 4 : తమిళ హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేవాడు. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలతో పోలిస్తే కాంచన సిరీస్ మాత్రం ఆయనకు మంచి పేరుని తీసుకొని వచ్చాయి. కాంచన సీరియస్ సినిమాల ద్వారా ఆయన ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హారర్ కామెడీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. కాంచన 3 తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ఆయన, ఇప్పుడు ‘కాంచన 4’తో మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే లారెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ బిజినెస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
హారర్ కామెడీ జోన్ లో రాబోతున్న కాంచన 4 కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని తెలుగు ఆడియోస్ తో పాటుగా తమిళ తంబీలు కూడా వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు దీని బిజినెస్ కాసుల వర్షం కురిపిస్తుంది. 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల రూపంలో రూ.50 కోట్లు, హిందీ రైట్స్ మరో రూ.50 కోట్లకు అమ్ముడు కావడంతో ఈ మూవీ అప్పుడే వంద కోట్ల బిజినెస్ చేసిపెట్టింది. ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి స్టార్స్ నటిస్తుండటంతో అటు నార్త్ లోను ఇటు సౌత్ లోనూ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది. మొత్తానికి అయితే రిలీజ్ కు ముందే లారెన్స్ హిట్ కొట్టేసాడు..
Also Read : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?
తమిళ హీరో రాఘవ లారెన్స్ జీవితం తెరిచిన పుస్తకం కాదు.. ఎన్నో కష్టాలను అధిగమించి సినిమాలకు పనిచేసే అవకాశాన్ని అందుకున్నాడు. అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో లారెన్స్. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ సినిమాలో భారీ విషయాలను అందుకున్నాయి. అందులో భాగంగా వచ్చినా కాంచన సినిమా మాత్రం అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వల్ గా కాంచన 4 సినిమా రాబోతుంది.. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..