BigTV English
Advertisement

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : మాస్ మహరాజ్ రవితేజ సినిమా మరో సారి బోల్తా కొట్టింది. థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా, కనీసం వారం రోజుల ప్రదర్శనకి కూడా నోచుకోవడంలేదు. రీసెంట్ గా వచ్చిన ‘మాస్ జాతర’ కి ఆడియన్స్ కూడా కరువయ్యారు. థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. విడుదలైన ఐదు రోజుల్లో మొత్తం కలెక్షన్లు 13 కోట్లకు మించలేదు. ఇది ఏ స్థాయిలో పరాజయం పాలైందో ఇట్టే తెలిసి పోతోంది.
అయితే అనుకున్న దానికంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. మరి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో అంటే

రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర నటించిన ఈ ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా, భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరో రెండు వారాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. రవితేజ అభిమానులు ఓటీటీలో వీక్షించేందుకు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Also : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్


స్టోరీ ఏమిటంటే 

పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనుకున్న లక్ష్మణ్‌ చివరికి రైల్వే పోలీస్‌ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి టెంపర్ తో ఉండే లక్ష్మణ్‌ తన చుట్టూ జరిగే అన్యాయాలను, రైల్వే పోలీస్‌ ఉద్యోగం చేస్తూనే అడ్డుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలొ ఓ మంత్రి కొడుకు చేసే అక్రమాలకు తన స్టైల్ లో చార్జ్ తీసుకుంటాడు. దీంతో అతన్ని మరో చోటుకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అక్కడ కూడా లక్ష్మణ్‌ ఇదే ఊపును కొనసాగిస్తాడు. ఇంతలో తులసి అనే అమ్మాయితో లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది. తులసి ఎంట్రీతో కథ కలర్ ఫుల్ గా మారుతుంది. అయితే గంజాయి స్మగ్లర్ అయిన శివుడు చాలా క్రూయల్ గా ఉంటాడు. అతనికి పెద్ద తలకాయల అండ కూడా ఉండటంతో, పోరు రసవత్తరంగా మారుతుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు యాక్షన్ సీన్స్ ఉంటాయి. చివరికి లక్ష్మణ్ అతని గంజాయి వ్యాపారాన్ని ఎలా అడ్డుకుంటాడు ? తులసితో లవ్ ట్రాక్ ఏమవుతుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

Big Stories

×