OTT Movie : కన్నడ సినిమాలు ఈ మధ్య జోరు మీద ఉన్నాయి. కె జి యఫ్, కాంతారాలతో ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేశాయి. ఓటీటీలో వీటితో పాటు మిగతా సినిమాలను కూడా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముందుగా హారర్ థ్రిల్లర్ పై మక్కువ చూపిస్తున్నారు.
రీసెంట్ గాథియేటర్లలో రిలీజ్ అయిన ‘కమరోట్టు 2’ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది 2019లో వచ్చిన ‘కమరొట్టు చెక్‌పోస్ట్’ సినిమాకు సీక్వెల్. అయితే దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉండటం విశేషం. మొదటి పార్ట్ కంటే, సెకండ్ పార్ట్ లో హారర్ కంటెంట్ ఎక్కువే ఉండబోతోంది. ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
పరమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ హారర్ థ్రిల్లర్ ‘కమరోట్టు 2’ (Kamarottu 2)లో స్వామినాథన్ అనంతరామన్, రజనీ భరద్వాజ్, అనిల్ బాబీ, రక్షిత్ వంటి నటులు నటించారు. 2025 ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, నవంబర్ 7 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే ఈ మూవీ అందుబాటులో ఉండబోతోంది.
Read Also : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్
న్యూఢిల్లీలో పారానార్మల్ రీసెర్చ్ సొసైటీలో పరిశోధకురాలిగా సారా అనే మహిళ పని చేస్తుంటుంది. ఆమె తన తప్పిపోయిన చెల్లెలు కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె తన సోదరిని వెతుక్కుంటూ కమరోట్టు అనే హాంటెడ్ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమెకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆమె అతీత శక్తులతో ఫైట్ చేస్తుంది. మరో వైపు కొత్తగా పెళ్లయిన ఆర్య, స్వాతి అనే దంపతులు, ఆర్య తండ్రి కొనుగోలు చేసిన పురాతన ఇంట్లో సమయం గడపడానికి కమరోట్టుకు వస్తారు. మొదట అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పటికీ, త్వరలోనే స్వాతి ఆ ఇంట్లో వింత సంఘటనలు ఎదుర్కొంటుంది. ఆర్య మొదట్లో ఆమె ఆందోళనలను కొట్టిపారేసినా, తరువాత అతనిని కూడా అతీత శక్తులు హంట్ చేస్తాయి. వీళ్ళంతా కలసి ఆ ఇంట్లో అసలు రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక క్లైమాక్స్ భయంకరంగా ముగుస్తుంది. చివరికి సారాకి తన సోదరి కనిపిస్తుందా ? కమరోట్టు ఇంటి రహస్యం ఏమిటి ? ఆర్య, స్వాతిల కథ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ కన్నడ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.