Prakash Rao-KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు. ఆయన చేసింది ముమ్మాటికీ నకిలీ దీక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దీక్ష సమయంలో జ్యూసులు, మెడిసిన్లు తీసుకున్నారని, అలాంటప్పుడు అది దీక్ష ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ఇంటలిజెన్స్,సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నరని ఈ విషయాన్ని అప్పుడే మీడియాకి చెప్పానని గుర్తు చేశారు. హరీష్ రావు చస్తా అని బెదిరించి పెట్రోల్ బాటిళ్లు పెట్టుకున్నారని, కానీ అక్కడ అగ్గిపెట్టే లేదన్నారు.
ఉద్యమకారులను రెచ్చిగొట్టి 1200 ప్రాణాలు కేసీఆర్ తీశారని దుయ్యబట్టారు గోనె ప్రకాష్‌రావు. కేసీఆర్ చేసిన దొంగ దీక్ష దివాస్‌పై కమిటీ వేసి దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.
తొలుత అసెంబ్లీలో 1200 మంది చనిపోయారని చెప్పారని ఆ తర్వాత మాట మార్చారని దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: తప్పిన ప్రమాదం.. అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు
రెండు రోజుల నుంచి దీక్ష దివాస్ పేరిట బీఆర్‌ఎస్ హడావుడి చేస్తోందన్నారు గోనె ప్రకాశ్‌రావు. తెలంగాణ జాగృతి పేరిట కవిత ఈ రోజు అందులోకి రంగ ప్రవేశం చేసిందన్నారు. ఇంఫాల్‌లో ఇరోం షర్మిల.. కేసీఆర్ కంటే తక్కువ ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారని గుర్తు చేశారు.