Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు.
వరల్డ్ వైడ్ గా ఈ చిన్నది శ్రీవల్లిగా గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమా అమ్మడి జీవితాన్ని మార్చేసింది.
ఇక ఇంకోపక్క రౌడీ హీరో విజయ్ దేవరకొండ రూమర్డ్ గిర్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకుంది. ఛలో సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది.
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఈ మధ్యనే రష్మిక – విజయ్ పెళ్లి అధికారికమని వార్తలు వినిపిస్తున్నాయి . ఇద్దరూ తమ పెళ్లి గురించి ఫ్యాన్స్ కు హింట్స్ ఇస్తూ వస్తున్నారు.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా నేషనల్ క్రష్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా రష్మిక.. తన ఫ్రెండ్ శ్రావ్య వర్మ పెళ్ళిలో సందడి చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. శ్రావ్య సంగీత్ లో ఆమె ఎంత అందంగా రెడీ అయ్యిందో చెప్పుకొచ్చింది.
గోల్డ్ కలర్ సల్వార్ సూట్ మీద అంతే అందమైన గోల్డ్ కలర్ ఆభరణాలను ధరించి మరింత అందంగా మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.