బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఈ షోలో అటు సెలబ్రిటీలు ఇటు కామనర్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో 8 సీజన్లు పూర్తికాగా.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభమైంది. అప్పుడే నాలుగు వారాలు కూడా పూర్తయ్యాయి. మొత్తం తొమ్మిదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా వచ్చిన వారిలో మొదటివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండవ వారం మర్యాద మనీష్, మూడవ వారం ప్రియా శెట్టి, నాలుగవ వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. మధ్యలో కామనర్ దివ్య నికిత హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీకి సర్వం సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. అందులో భాగంగానే 30వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ మేట్స్ బెండ్ తీస్తున్నారు బిగ్ బాస్. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. “రణరంగం మీ ఊహలకు అందని ప్రదేశం. ఈవారం డేంజర్ లో ఉన్నవారికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. వచ్చే వైల్డ్ స్ట్రోమ్ డేంజర్ జోన్ లో ఉన్న వారికి అతిపెద్ద ప్రమాదంగా మారనుంది. వైల్డ్ స్ట్రోమ్ ఏంటో మీకు తెలుసా? అదే వైల్డ్ కార్డు ఎంట్రీస్. ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ తుఫాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒకే ఒక్క ఛాన్స్ అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్
ALSO READ:Janhvi kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త మూవీ.. ట్విస్ట్ ఏంటంటే?
భరణి శంకర్, పవన్, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన టాస్క్ లోకి దిగారు. ఒకవైపు నుంచి వారు బ్యాలెన్స్ చేస్తుండగా.. మరొకవైపు నుంచి మిగిలిన కంటెస్టెంట్స్ ఎదురుగా ఉన్న బాస్కెట్ లోకి వేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఎక్కువసేపు చేతులు బెండు చేయకుండా ఇసుక బకెట్ ను స్టాండ్ సపోర్టుతో మోస్తారో వారే టాస్క్ విజేత. కానీ బరువు మోయలేక సంజనా, సుమన్ శెట్టి వదిలేస్తారు. ఆ తర్వాత పవన్, కళ్యాణ్ , భరణి శంకర్ పోటీ పడగా.. కళ్యాణ్ కూడా ఆఖరికి వదిలేస్తారు. పవన్ , భరణి మధ్య పోటీ ఉండగా భరణి చేతులు బెండ్ చేస్తున్నాడు అని హౌస్ మేట్స్ అంతా గొడవ పెట్టుకున్నారు. అలా మొత్తానికి అయితే ఈ ప్రోమో వైల్డ్ కార్డు ఎంట్రీస్ పై ఆసక్తి పెంచింది. మరి హౌస్ లోకి ఎవరు అడుగు పెడతారో చూడాలి.