Inzamam-ul-Haq: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ పంది లాగా ఉంటాడని, ముసలోడు అయిపోయాడు అని అందుకే అతని కెప్టెన్సీ తొలగించినట్లు బాంబు పేల్చాడు ఇంజమామ్ వుల్ హక్. అయితే రోహిత్ శర్మ పై ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అతన్ని ఉద్దేశించి రోహిత్ శర్మ అభిమానులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే సిరీస్ అయిన నేపథ్యంలో మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్ అవుతాడని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని రీతిలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పీకి పారేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో రోహిత్ శర్మ స్థానంలో శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా అందుకున్నాడు.
అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. పలుగురు మాజీ క్రికెటర్లు కూడా ఈ అంశంపై సీరియస్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఏజ్ అయిపోయింది. అతన్ని కెప్టెన్ గా పరిగణించడం చాలా కష్టం. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ అంతా పెద్దగా ఏమీ ఉండదు. ముసలాడు కూడా అవుతున్నాడు. చూడడానికి పందిలాగా కనిపిస్తాడు… అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంజమామ్ వుల్ హక్. అందుకే రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలగించినట్లు ఆయన కామెంట్స్ చేశారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ ను టార్గెట్ చేశారు రోహిత్ శర్మ అభిమానులు.
రోహిత్ శర్మ పై ఇంజమామ్ వుల్ హక్ చేసిన కామెంట్లను నేపథ్యంలో అతని అభిమానులు రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఫిట్ నెస్ ఉన్న ఆటగాడు, అతన్ని మించిన కెప్టెన్ ఎవరూ లేరని పొగుడుతూ, ఇంజమామ్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇంజమామ్ వుల్ హక్ అయితే దున్నపోతు లాగా ఉంటాడు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. మీ దేశం గురించి నువ్వు చూసుకో, అనవసరంగా ఇండియన్ గెలకకు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.