Womens World Cup 2025: వన్డే వరల్డ్ కప్ 2025 మహిళల టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ లో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా అదరగొడుతున్నాయి. సౌత్ ఆఫ్రికా కూడా దుమ్ము లేపుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. గౌహతి లోని బర్స పారా క్రికెట్ స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ ఉండనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫైట్ జరగనుంది. అర్ధరాత్రి 10 గంటల వరకు ఈ మ్యాచ్ కొనసాగుతుంది.
ఇందులో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ తీసుకునే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ. గౌహతి లో ఇవాళ వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది. మ్యాచ్కు వర్షం కూడా అడ్డంకిగా మారే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ కచ్చితంగా ఉంటుంది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, రెండు మ్యాచ్ లు ఆడి రెండిటిలోనూ టీమిండియా గెలిచి నాలుగు పాయింట్లు సంపాదించింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఇండియా. ఆ తర్వాత ఆస్ట్రేలియా 3 పాయింట్లు సాధించగా ఇంగ్లాండ్ 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ రెండు పాయింట్లతో ఉంది. అనంతరం సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు నిలిచాయి. ఈ వన్డే వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ చిట్ట చివరణ ఉంది. మరో మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ కూడా అయ్యే ప్రమాదం ఉంది.
ఇంగ్లాండ్ ప్రాబబుల్ XI: టామీ బ్యూమాంట్ (Tommy), అమీ జోన్స్ (WK ), హీథర్ నైట్, నాట్ స్కివర్-బ్రంట్ (c), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ క్యాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI: ఫర్గానా హోక్, రుబ్యా హైదర్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా (c & wk), శోభనా మోస్తరీ, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, మరుఫా అక్టర్, నిషితా అక్టర్ నిషి
South Africa opened their account in the CWC 2025 and have moved to 5th spot in the points table! 🏏🇿🇦#CWC25 #SouthAfrica #NZWvSAW #Sportskeeda pic.twitter.com/LOJ0pzrTr2
— Sportskeeda (@Sportskeeda) October 6, 2025