Mrunal Thakur : ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మొదటి సినిమాకే ఇంత రెస్పాన్స్ రావడం చూసిన ఆమె అభిమానులు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు. ఫస్ట్ సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్య కాస్త బోల్డ్ లుక్ లోకి మారిపోయింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ సినిమాలు చేస్తూ బోల్డ్ ఫోటోషూట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ పై ఫ్యాన్స్ పెదవిరుస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలో నటించింది. మొదటి సినిమా నుంచి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా నానితో నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటించింది. ఆ మూవీ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా బోల్డ్ లుక్ లో ఆ ఫోటోలు కనిపించడంతో మృణాలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..
Also Read : పల్లవి పై అవనికి అనుమానం.. రాజేశ్వరికి నిజం చెప్పిన అవని..శ్రీవల్లికి కమల్ షాక్…
మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు అటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తాని చాటేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక సమయం దొరికితే కమర్షియల్ యడ్స్ చూస్తూ రెండు చేతులా ఆర్జిస్తుంది. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది తరుచూ తన డిఫరెంట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆమె చేస్తున్న ఫోటోషూట్ ప్రేక్షకులను కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బాలీవుడ్ కి వెళ్తే ఇంతగా మారిపోతారు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారిగా మృణాల్ ని ఇలా 0చూసినా ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ ఫోటోషూట్ పై నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై మృణాలు రెస్పాండ్ అవుతుందేమో చూడాలి..