Bengaluru News: చెట్లు ఎంత అందాన్నిమాత్రమేకాదు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. వాటి వల్ల ముప్పు కూడా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ బెంగుళూరు సిటీలో జరిగిన ఘటన. చెట్టు పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోలదేనహళ్లి ప్రాంతంలో జరిగింది.
బెంగుళూరులో ఘోరం
బెంగుళూరు సిటీలోని సోలదేవనహళ్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు భారీ చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో 23 ఏళ్ల కీర్తన మృతి చెందింది. హెబ్బల్ నివాసి కీర్తన తన ఫ్రెండ్ రాధతో కలిసి సోలదేవనహళ్లిలోని ఆచార్య కళాశాలలో క్రికెట్ మ్యాచ్ చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. టూ వీలర్స్‌పై కీర్తన ఆమె ఫ్రెండ్ వస్తున్నారు.
ఆ సమయంలో సడన్‌గా చెట్టు కూలిపోయి వారి వాహనంపై పడి నుజ్జునుజ్జు అయ్యింది. మరో ద్విచక్ర వాహనదారుడు భాస్కర్ గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ముగ్గుర్నీ స్థానికులు-పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కీర్తన అక్కడికి తీసుకెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాధ, భాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు.
సడన్‌గా కూలిన చెట్టు, యువతి మృతి
ఏడాదిగా ఆ చెట్టు బలహీనంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఘటన సమయంలో ఎలాంటి గాలి వీయలేదు. ఈ ఘటనపై కీర్తన కుటుంబం నుండి ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బీబీఎంపీ అధికారులను అప్రమత్తం అయ్యారు. కూలిపోయిన చెట్టును నరికి తొలగించారు.
ALSO READ: సీజేఐపై దాడి యత్నాన్ని ఖండించిన పలువురు నేతలు
ఈ ఘటనతో రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. ఇటీవలకాలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గాలుల దాటికి చాలా చెట్లు బలహీనపడ్డాయి. వాటిని తొలగించే పనిలో పడినట్టు తెలుస్తోంది. చెట్లు విరిగిపోయే ఘటనలు కేవలం బెంగుళూరుకి పరిమితం కాలేదు. ఆ మధ్య హైదరాబాద్, విశాఖ సిటీల్లో వర్షం- గాలులకు చెట్లు విరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. పొడవుగా పెరిగిన చెట్లపై అక్కడి కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు.