YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విపక్ష పార్టీగా వైసీపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చర్యలు చేపడుతోంది. అక్టోబర్ 7న, మంగళవారం, ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ కాన్‌స్టిట్యూన్సీల అబ్జర్వర్లతో సమావేశం.. ఈ సమావేశం వైసీపీ కార్యాలయంలో జరపనున్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో వైసీపీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించారు.
ఈ సమావేశంలో జగన్ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను వివరించనున్నారు. ముఖ్యంగా, వైద్య, విద్య, రవాణా, విద్యుత్ వంటి కీలక రంగాల్లో జరుగుతున్న అవినీతి, ప్రజల అభద్రతలను గురించి తెలియజేస్తారు.. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు జాతీయ, రాష్ట్ర స్థాయి సమస్యలను పార్టీ స్థాయిలో చర్చించి, ప్రజలకు సమాచారం అందించాలి. ఈ సమావేశం ద్వారా పార్టీలోని క్రమశిక్షణ, సమన్వయాన్ని మెరుగుపరచడానికి దిశానిర్దేశాలు ఇచ్చారు.
Also Read: సీజేఐపై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..
అయితే ఇప్పటి వరకు కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలపై వైసీపీ ఆందోళలను, నిరసనలు, ధర్నాలు వంటివి వివిధ రూపాల్లో చేస్తున్న కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే హాజరవుతూ వచ్చారు.. 9వ తేదీన మెడిక్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రత్యక్ష పోరకు ఆయన సిద్దమయ్యారు. అంతేకాకుండా మెడికల్ కళాశాలల పీపీపీ అంశం, రాష్ట్రంలో నకిలీ మద్యం సహా పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.. ఇవాళ్టి సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశల్లో జగన్ 2.0 డిజిటల్ బుక్ వంటి సంచలననాలకు తెర తీసిన జగన్.. నేడు నేతలకు ఏం చెప్పబోతున్నారో అనేది అందరికి ఆసక్తికరంగా మారింది.
నేడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల సమావేశం..
ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో వైసీపీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం
తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ… pic.twitter.com/89ixk6O8wM
— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2025