BigTV English

Bigg Boss 9 Telugu : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

Bigg Boss 9 Telugu : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నా టాప్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.. ప్రస్తుతం 9వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఐదవ వారంలోకి అడుగు పెట్టింది.. ఈవారం నామినేషన్స్ వాడీ వేడిగా జరిగాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బిగ్ బాస్ నామినేట్ చేయడం కాస్త ఆసక్తిగా మారింది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈవారం డబల్ ఎనిమినేషన్ ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా పవన్ కళ్యాణ్ తమ్ముడు కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..


రీతూ మా వాడిని చెడగొట్టింది..

బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి డిమాన్ పవన్ కళ్యాణ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అన్న విషయం ఇప్పటికే అందరికీ స్పష్టం అయిపోయింది. గత రెండు వారాల క్రితం నాగార్జున ఇచ్చిన క్లాస్ తో దాదాపు అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. నిజంగానే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందో లేదో కానీ.. హౌస్ లో మాత్రం కాస్త కంటెంట్ ఎక్కువగానే దొరుకుతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తమ్ముడు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి అవతల వ్యక్తి బాధపడుతుంటే తీసుకునే వాడు కాదు. వాళ్ళని ఓదార్చి, సంతోషపరిచేంత వరకు అతని మనసు శాంతించేది కాదు. ఇప్పుడేమో రీతు చుట్టు తిరుగుతూ గేమ్ ని ఆడలేక పోతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి మా వాడి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి కారణంగా మా వాడి గేమ్ చాలా దెబ్బ తిన్నది. అమ్మాయితో మాట్లాడటం మానేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవుతాడంటూ తన తమ్ముడు ఇండైరెక్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయము పవన్ కళ్యాణ్ వరకు చేరుతుందో లేదో చూడాలి..

Also Read : బాపురే.. ఇదేం ఫోటో షూట్ తల్లి..ఇలా మారావేంటి మృణాల్..?


ఆర్మీ మ్యాన్ గా పవన్ కళ్యాణ్..

బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది కంటెస్టెంట్స్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యారు. గతంలో లాగా ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసే బిగ్ బాస్ ఈసారి అగ్నిపరీక్ష ద్వారా పలువురిని సెలెక్ట్ చేసింది. అందులో ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఒకరు.. సాధారణ సామాన్యుడిగా పాల్గొన్న ఈయన, అద్భుతంగా టాస్కులు ఆడుతూ అశేష ప్రేక్షాభిమానం ని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఆయన ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే అడుగుపెట్టాడు. ఈయన పై అంచనాలు భారీగానే ఉండేవి.. మూడు వారాలు పెద్దగా కెమెరాకి కనిపించని ఈయన ఇప్పుడిప్పుడే కాస్త కెమెరా వద్ద నిలుస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు.. మరి జనాల నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటాడా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో తెలిసే అవకాశం ఉంది..

Related News

Bigg Boss 9 Telugu : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?

Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 9 Elimination: హరీష్ అవుట్.. భరణి నిజస్వరూపం ఇదే, తనూజ అచ్చం నాలాగే.. మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Big Stories

×