Arasan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే సినిమాలు అన్ని రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. అసురన్, విడుదల.. ఇలా ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని డైరెక్టర్స్ లిస్ట్ లో వెట్రిమారన్ కూడా ఒకడు. విడుదల పార్ట్ 2 తరువాత వెట్రిమారన్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. అయితే సూర్యతో వెట్రిమారన్.. వాడివసూల్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. సగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కానీ, మధ్యలో సూర్య – వెట్రిమారన్ కు విభేదాలు తలెత్తడంతో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
వెట్రిమారన్ స్టోరీ చెప్పినప్పుడు బాగానే ఉంది కానీ, షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ కథ మారిందని, అంతేకాకుండా షూటింగ్ కోసం చాలా డేట్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయాడని, అందుకే సూర్య బయటకు వచ్చేశాడని టాక్. ఇక ఇప్పుడు అదే కథను వెట్రిమారన్ శింబుతో చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ, ఆ కథ వేరు.. ఈ కథ వేరు అని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇక శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం STR49. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో శింబు ముఖం కనిపించలేదు కానీ, వింటేజ్ లుక్ లో కనిపించాడు. చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు.. వెట్రిమారన్ స్టైల్ అని ఇట్టే చెప్పేయొచ్చు.
అరసన్ అంటే రాజు అని అర్ధం. ఈ సినిమాలో శింబు రాజుగా కనిపించబోతున్నాడు. ఇది కూడా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇది కేవలం తమిళ్ భాషలోనే తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కనుక డబ్ చేస్తే ఇదే టైటిల్ పెడతారా.. ? మారుస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో శింబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ஆளப்பிறந்த அரசன்
வெற்றியுடன் சிலம்பரசன்#VetriMaaran @SilambarasanTR_#STR49 #SilambarasanTR #VCreations47 #ARASAN pic.twitter.com/zLk8chzGJl— Kalaippuli S Thanu (@theVcreations) October 7, 2025