R Ashwin Pension: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 5 టెస్ట్ ల సిరీస్ లో మూడవ టెస్ట్ ముగిసిన అనంతరం {R Ashwin Pension} తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రెస్ మీట్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తెలిపాడు అశ్విన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. భారత జట్టుకు 14 ఏళ్ల పాటు ఆడినందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు టీమ్ ని విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
Also Read: Gianluigi Donnarumma Injury: ఇదేం ఆట… ముఖంపై బూటుతో తన్ని మరీ ?
జూన్ 5వ తేదీ 2010లో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అకస్మాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశాడు. అయితే అతను రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ {R Ashwin Pension} గురించి ఓ చర్చ జరుగుతుంది. అశ్విన్ కి ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానులలో మొదలైంది. మన దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కనీసం 25 మ్యాచ్ లు ఆడిన వారికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పెన్షన్స్ సౌకర్యం కల్పిస్తోంది. 25 నుంచి 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారికి నెల నెల 30 వేల పెన్షన్ అందుతుంది.
అదే 50 నుండి 74 మ్యాచ్ లు ఆడిన వారికి 45 వేల పెన్షన్ ఇస్తున్నారు. ఇక 75 కి పైగా మ్యాచ్ లు {R Ashwin Pension} ఆడిన వారికి ప్రతి నెల 52, 500 పెన్షన్ ఇస్తున్నారు. ఈ గణాంకాల ప్రకారం 106 టెస్టులు ఆడిన అశ్వినికి నెలకు 52 వేల వరకు పెన్షన్ అందనుంది. గతంలో మాజీ క్రికెటర్లకు 15 వేల నుంచి 50 వేల వరకు బీసీసీఐ పెన్షన్ చెల్లించేది. రిటైర్మెంట్ కి ముందు సదరు క్రికెటర్ పొందిన కాంట్రాక్ట్, పొందిన వేతనం పై ఆధారంగా వారికి అందించే పెన్షన్ నిర్ణయించబడి ఉండేది. కానీ దీనిని జూన్ 2022 సంవత్సరంలో 100% పెంచుతూ భారత క్రికెట్ బోర్డు ( బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది.
Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ
దీనివల్ల అంతకుముందు 15 వేలు తీసుకునే మాజీ క్రికెటర్లు 2022 నుంచి నెలకు 30 వేల పెన్షన్ అందుకుంటున్నారు. ఇలా పెన్షన్ అమౌంట్ పెంచిన తర్వాత భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కి 30 వేల పెన్షన్ లభిస్తుంది. దీంతో కాంబ్లీ కంటే అశ్విన్ కి {R Ashwin Pension} అధికంగా పెన్షన్ లభిస్తుందని.. పెన్షన్ విషయంలో కూడా కంబ్లీకి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వీరిద్దరూ ఆడిన మ్యాచ్ ల వివరాలకు వస్తే.. అశ్విన్ 106 టెస్టులు ఆడగా, కాంబ్లీ 17 టెస్టులు మాత్రమే ఆడాడు. అంటే మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కేటగిరీలోనే కాంబ్లీకి పెన్షన్ వస్తుంది. ఇక అశ్విన్ 106 టెస్టులు ఆడడంతో రెట్టింపు పెన్షన్ అందుకుంటారు. బీసీసీఐ 2022లో రివైజ్ చేయకుంటే ఇందులో సగమే వచ్చేది.