BigTV English

Young Director: ప్రదీప్ చేతిలో రజినీ, కమల్ మూవీ… యంగ్ డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే ?

Young Director: ప్రదీప్ చేతిలో రజినీ, కమల్ మూవీ… యంగ్ డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే ?

Young Director: సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల‌తో కలిసి లోకేష్ ఒక భారీ మల్టీస్టారర్ చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ఈ మూవీని తెరకెక్కించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది.. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తెరకెక్కబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఎందుకు ఏమో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లోకేష్ కాదు మరొక డైరెక్టర్ అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అయితే ఆ డైరెక్టర్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


రజినీ, కమల్ తో ప్రదీప్ మల్టీస్టారర్..?

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ప్రస్తుతం ఖైదీ 2 సినిమా తెరికెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఆ మధ్య రజిని, కమల్ తో గ్యాంగ్ స్టర్ మూవీ రాబోతుందని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని చేయలేకపోతున్నారంటూ మరో వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ భారీ కాంబినేషన్ ని చేసే మరో దర్శకుడు ఎవరు అనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే అలా వచ్చిన కొన్ని పేర్లలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అలాగే హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా తెర పైకి వచ్చింది.

అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడుగా సినిమాలు తీసే అవకాశం ఇప్పట్లో లేదన్న వార్తలు కూడా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాను నటన మీద మాత్రమే ఫోకస్ గా ఉన్నానని దర్శకునిగా సినిమాలు చేయడం లేదని సో ఈ కాంబినేషన్ దర్శకుడు తాను కాదని చెప్పినట్టు టాక్.. మరి ఈ క్రేజీ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది..


Also Read : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

ప్రదీప్ రంగనాథన్ సినిమాల విషయానికొస్తే.. 

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మొదట పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ డైరెక్టర్చేసిన సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి.. డ్రాగన్ సినిమాతో హీరోగా మారాడు. మూవీ బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. డ్యూడ్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాడు. ఈనెలలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ నందుకు ఉంటుందో చూడాలి. అటు డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మల్టీ స్టారర్ మూవీ కి డైరెక్టర్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉందని సమాచారం.

Related News

Vyjayanthi Movies: యాక్షన్ అడ్వెంచర్ కాదు లేడీ ఓరియంటెడ్.. భలే ప్లాన్ చేస్తున్నారే?

Kantara Chapter 1 : కాంతార2లో తెగ నాయకుడితో రిషబ్ శెట్టికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Shrikanth Bharat: వాడు మహాత్ముడా.. 15 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టి…

Krithi Shetty: రీమేక్ చేయడానికి బాలీవుడ్ కి వెళ్లాలా.. కృతి కొత్త మూవీపై విమర్శలు!

Samantha: కోలీవుడ్ కి పయనమవుతున్న సమంత.. ఆ స్టార్ హీరోతో జతకట్టనుందా?

Arasan: వెట్రిమారన్- శింబు టైటిల్ తెలిసిపోయిందోచ్..

Mrunal Thakur : బాపురే.. ఇదేం ఫోటో షూట్ తల్లి..ఇలా మారావేంటి మృణాల్..?

Big Stories

×