BigTV English

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Modified Scooter Video:

ఈ రోజుల్లో చాలా మంది తమ వాహనాలు.. ముఖ్యంగా కార్లు, బైకులు, స్కూటర్లు, ఇతర వెహికిల్స్ కొనుగోలు చేయగానే, తమ అభిరుచికి తగినట్లుగా కాస్త మోడీఫికేషన్ చేయించుకుంటున్నారు. బంపర్ స్టిక్కర్ల నుంచి కస్టమ్ పెయింట్ జాబ్‌ల వరకు మార్పులు చేర్పులు చేయించుకుంటారు. కొంత మంది వీల్స్ కు అందమైన హంగులు అద్దగా, మరికొంత మంది స్టీరింగ్ ను క్రేజీగా తయారు చేయించుకుంటారు. ఇంకొంత మంది అదనపు లైట్లు పెట్టించుకుంటారు. మొత్తంగా చూడ్డానికి వావ్ అనిపించేలా తయారు చేయించుకుంటారు. ఇక తాజాగా ఓ వ్యక్తి తన స్కూటర్ ను కూడా మోడీఫై చేయించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా.. వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి క్రేజీగా తయారు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ స్కూటర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..


రంగు రంగుల లైట్లలో క్రేజీ మోడీఫికేషన్

మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్ కు చెందిన ఓ వ్యక్తి తన స్కూటర్ అద్దిన అదనపు హంగులు ఆందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాడీ అంతా లైట్లు, రత్నాలు, ముత్యాలతో అలరించాడు. గులాబీ, నారింజ రంగులలో మూడు ఈకల లాంటి ఆభరణాలతో కూడిన  సొగసైన కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. సింహాసనాన్ని పోలి ఉండే రాయల్ బ్లూ సీటును ఏర్పాటు చేయించాడు.  హ్యాండిల్స్ రెండు వైపులా అందంగా ఊగుతున్న ఆకుపచ్చ టాసెల్ లతో అలంకరించాడు. ఈ స్కూటర్ విచిత్రంగా కనిపించడంతో పాటు ఎంతో వినోదభరితంగా ఆకట్టుకుంటుంది.  అంతేకాదు, ఈ స్కూటర్ కు సంగీతాన్ని అందించే మొబైల్ యాడ్ చేయబడింది. హెడ్ లైట్ మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన ప్రత్యేకమైన డిస్ ప్లేలో వీడియో చూసేలా ఏర్పాటు చేశారు. ఇందులో నచ్చిన పాటలు వినేలా, నచ్చిన వీడియోలు చూసేలా తయారు చేశాడు. స్కూటర్ వీల్స్ కు బ్లింగ్ ట్రీట్‌మెంట్ చేయించాడు. మెరిసే బంగారు, వెండి రత్నాలతో అలంకరించబడ్డాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ జబల్‌ పూర్ లో తెలియని వారు లేరంటే, ఎంత క్రేజ్ సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.


క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా బాగుందంటున్నారు. మరో వ్యక్తి దీన్ని ‘రణ్ వీర్ సింగ్ కి స్కూటర్’ అని కామెంట్ చేశాడు.  “ఈ స్కూటర్ ను మరింత మెరుగు పరిచేలా భద్రతా వ్యవస్థ, వైఫై, ఇన్వర్టర్, బహుశా శాటిలైట్ కనెక్టన్ కూడా ఇన్‌ స్టాల్ చేయవచ్చు” అని మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు.

రియాక్ట్ అయిన ఆనంద్ మహీంద్రా

ఈ స్కూటర్ గురించి గతంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు. దీని వీడియోను షేర్ చేస్తూ, స్కూటర్ ను మోడీఫై చేయించిన యజమాని సృజనాత్మకతను అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. తమ దగ్గర ఎలాంటి వాహనం ఉందని కాదు, ఉన్నదాన్ని ఎంత అద్భుతంగా, అపురూపంగా, కలర్ ఫుల్ గా మార్చుకున్నా, చూసుకున్నాం అనేదే ముఖ్యమన్నారు. మొత్తంగా ఈ స్కూటర్ జబల్పూర్ తో పాటు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.

Read Also: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Related News

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Big Stories

×