ఈ రోజుల్లో డ్రోన్ల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఆయా వేడుకల్లో ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగిస్తున్నారు. మరికొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు ఆహారం, ఔషధాలు అందించేందుకు వాడుతున్నారు. ఈ మధ్య వరదల్లో చిక్కుకున్న వారిని కూడా డ్రోన్ల సాయంతో లిఫ్ట్ చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ముఖ్యంగా పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని దేశాల్లో డ్రోన్ల సాయంతో వస్తువులను డెలివరీ చేస్తున్నారు. ఇక యుద్ధాల్లోనూ డ్రోన్లతో శత్రుదేశాల మీద దాడులు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ముఖ్యమైన అవసరాల కోసం కొంత మంది డ్రోన్లను ఉపయోగిస్తే, మరికొంత మంది ఫన్నీ వీడియోలు క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి రావడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. రష్యాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా కోడిపుంజును డ్రోన్ కు కట్టి ఎగురవేశాడు. ముందుగా కోడిపుంజుకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా డ్రోన్ కు కట్టాడు. ఆ తర్వాత నెమ్మదిగా గాల్లోకి లేపాడు. రెండు, రెండున్నర కేజీల బరువు ఉన్నప్పటికీ, కోడిపుంజు ఈజీగా గాల్లోకి ఎగిరింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత దాన్ని మళ్లీ కిందికి దించాడు. కోడి పుంజు కూడా ఏమాత్రం భయపడకుండా నెమ్మదిగాపైకి ఎగిరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Russian Drone. French edition. pic.twitter.com/xfwtG1k0y8
— Russian Market (@runews) October 4, 2025
Read Also: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…
ఇక ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేయడంతో నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. అవసరాల కోసం ఉపయోగించాల్సిన డ్రోన్స్ ను ఫన్నీగా ఉపయోగించాలనే ఆలోచన చేయడం బాగుందంటున్నారు. మరికొంత మంది “పని లేని మంగలి పిల్లి తల గొరగడం అంటే ఇదే కావచ్చు” అని కామెంట్ పెడుతున్నారు. “అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ” అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “డ్రోన్స్ ను ఇలా వాడాలని ఇప్పటి వరకు తెలియదు” అంటూ మరికొంత మంది రాసుకొస్తున్నారు. “దీన్ని ఇకపై చికెన్ డ్రోన్ అని పిలవాలి అనుకుంటా” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా కోడిపుంజును గాల్లోకి తీసుకెళ్లే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సాధించగా, వేలల్లో కామెంట్స్ సాధించింది. ఎక్కువ మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!