Shraddha Das: బంగారు హుండీని చిల్లర కోసం వాడుకుంటున్నారు అని కెజిఎఫ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ ఈ లైన్ కు సెట్ అయ్యే హీరోయిన్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
అందం, అభినయం, గ్లామర్ షో చేయగల సత్తా ఉన్న హీరోయిన్స్ ఇప్పటికీ గుర్తింపు లేకుండా కేవలం ఫోటోషూట్స్ కు మాత్రమే పరిమితమవుతున్నారు.
అలా అందం, అభినయం ఉండి గుర్తింపు రాని హీరోయిన్స్ లిస్ట్ లో శ్రద్దా దాస్ కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా అమ్మడికి మాత్రం సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు.
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన శ్రద్దా దాస్.. ఆ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకుంది.
కానీ, శ్రద్దా దాస్ కి మాత్రం విజయాలు దక్కలేదు. సెకండ్ హీరోయిన్ గా.. ఐటెంసాంగ్స్ చేస్తూ.. గెస్ట్ రోల్స్ చేస్తూ కాలం గడిపేస్తుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే అమ్మడి అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో శ్రద్దా చాలా శ్రద్దగా అందాలను చూపిస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ బాడీకాన్ డ్రెస్ లో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ కనిపించింది.
జలకన్యలా అమ్మడు అంతలా అందాలను ఆరబోస్తున్నా.. ఆమెకు ఎందుకు ఛాన్స్ లు రావడం లేదు అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మరి శ్రద్దాకు ముందు ముందు మంచి అవకాశాలు వచ్చి హిట్ పడతాయేమో చూడాలి.