The Great Pre wedding show: కొన్ని సినిమాలు బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించవు. అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఒక సినిమాను సపోర్ట్ చేస్తే దాని రేంజ్ వేరేలా ఉంటుంది. కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా వచ్చినప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఆ సినిమా గురించి మాట్లాడటం వల్లనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అలానే బలగం సినిమాకి కూడా మంచి ఆదరణ లభించింది.
నిన్న రిలీజ్ అయిన ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. థియేటర్స్ కూడా అక్కడక్కడ ఫీల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీసు సినిమా గురించి ట్రీట్ వేస్తే ఆ సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. కానీ ఎవరూ కూడా ఆ సినిమాని సపోర్ట్ చేయడం లేదు. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇప్పుడే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ సినిమా చూశాను సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా విపరీతంగా నచ్చింది చాలా సరదాగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి అని అని కోరుకుంటున్నాను. అంటూ ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొత్తానికి ఒక సెలబ్రిటీ ఈ సినిమా గురించి ట్వీట్ చేయటం గొప్ప విషయం.
అయితే ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది చాలా రివ్యూలు త్రీ రేటింగ్ కూడా ఇచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో వేచి చూడాలి.
Just watched #TheGreatPreWeddingShow and absolutely loved how simple, funny & real it felt! ❤️
Urge everyone to watch it immediately!
Packed with so much heart, laughs & honesty.Congrats brother @iamThiruveeR
You deserve this long ago 🤗Big hugs to debut Director…
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) November 8, 2025
అన్ని సినిమాలు మాదిరిగా సినిమా విడుదలైన సాయంత్రానికే సక్సెస్ మీట్ పెట్టకుండా జెన్యూన్ గా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేడు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ జరిపారు. ఈ సక్సెస్ మీట్ లో తిరువీరు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తాము అని తెలిపారు.
గతంలో చాలా సినిమాలకి ఇలానే కొన్ని రోజులు పోయిన తర్వాత మంచి పికప్ వచ్చింది. ఈ సినిమాకి కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.
Also Read: Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి