RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటాడు. సినిమాలు, సెలబ్రిటీలు, రాజకీయాలు ఏది వదలడు. నైట్ వోడ్కా వేస్తే ట్వీట్స్ వర్షం కురిపిస్తాడు. అసలు ఎవరు ఏం అంటారు అనే భయం కూడా ఉండదు. జనసేన గెలవకముందు వరకు పవన్, చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టమొచ్చినట్లు ట్వీట్స్ వేసి.. ఇప్పుడు పోలీసుల కేసులంటూ తిరుగుతున్నాడు. అయితే ఈ ఏడాది నుంచి అసలు వివాదాల్లోకి వెళ్ళను అని చెప్పాడు వర్మ.
ఇక ఇదంతా పక్కన పెడితే.. వర్మ.. దివంగత నటి శ్రీదేవికి ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెల్సిందే. అభిమాని అని కాదు కానీ, భక్తుడు అని చెప్పాలి. ఆమె అందానికి వర్మ. మంత్రముగ్దుడు అని చెప్పొచ్చు. శ్రీదేవితో కలిసి వర్మ రెండు సినిమాలు తీసాడు. క్షణక్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలు తీసి.. అందులో శ్రీదేవి అందం గురించే పాటలు రాయించి.. ఆమె సీన్స్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండేవాడట.
Comedian Sudhakar: హీరోయిన్ రాధికా చీర కుచ్చిళ్లలో చేతులు పెట్టా.. అందరి ముందు అలా చేసింది
శ్రీదేవి చనిపోయినప్పుడు ఎవరు ఎంత బాధపడ్డారో తెలియదు కానీ, ఈ క్షణం వరకు వర్మ బాధపడుతూనే ఉంటాడు. ఆమె అంటే అంత ప్రేమ. ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా శ్రీదేవి గురించి చెప్పడానికి అస్సలు వెనుకాడడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ మరోసారి శ్రీదేవిని గుర్తుచేసుకున్నాడు. శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి లేదు అని, ఆమెలా ఆమె కూతురు జాన్వీ కపూర్ లేదని చెప్పుకొచ్చాడు.
“శ్రీదేవి నటిస్తుంటే ఆమెను అలానే చూస్తూ ఉండిపోవచ్చు. ఒక పదహారేళ్ల వయస్సు కావచ్చి.. ఒక వసంత కోకిల కావచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. ఆమె స్క్రీన్ పైఉన్నప్పుడు నేను ఒక డైరెక్టర్ అన్న మాటనే మర్చిపోతాను” అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో ఏమైనా సినిమా చేస్తారా.. ? అంటే నిర్మొహమాటంగా నో అని చెప్పేశాడు.
Urvashi Rautela: పొగుడుతున్నారనుకుంటుందేమో.. అమ్మ నా బూతులు తిడుతున్నారని చెప్పండ్రా పాపకు..
” నాకు తల్లి శ్రీదేవి అంటే ఇష్టం.. కూతురు జాన్వీ కపూర్ అంటే కాదు. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇంకా చెప్పాలంటే నేను ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొను.. జాన్వీతో సినిమా తీసే ఉద్దేశ్యం లేదు” అని చెప్పుకొచ్చాడు. అదేంటీ జాన్వీపాప గురించి అలా అన్నాడు వర్మ మావ. దేవర సినిమాలో ఈ చిన్నదాన్ని చూసి అందరూ తల్లి శ్రీదేవి అందం పుణికిపోవుచ్చుకున్నట్లు ఉంది. ఆమెను చూసినట్లే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో జాన్వీ.. వర్మను మెప్పిస్తుందేమో చూడాలి.