Baramulla OTT : హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ని ఒక బాలీవుడ్ సినిమా ఊహించని ట్విస్టులతో మతి పోగొడుతోంది. రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది. ఈ కథ కాశ్మీర్‌లో పిల్లలు అదృశ్యమయ్యే మిస్టీరియస్ కేసును పరిశోధించే ఒక పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, హారర్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ సినిమా చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బరముల్లా’ (Baramulla) 2025లో వచ్చిన హిందీ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు అదిత్య సుహాస్ జంభలే (ఆర్టికల్ 370 ఫేమ్) దీనిని తెరకెక్కించాడు. ఇందులో మనవ్ కౌల్ (DSP రిద్వాన్ సయ్యద్), భాషా సుంబ్లీ (గుల్నార్), అరిస్టా మెహతా (నూరీ), రోహన్ సింగ్ (అయాన్), మసూమ్ ముమ్తాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 112 రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.3/10లో రేటింగ్ పొందింది. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 2025 నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హిందీతో పాటు, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, స్పానిష్ వంటి ఇతర భాషలలోనూ డబ్బింగ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
రిద్వాన్ సయ్యద్ అనే సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్‌లోని బరముల్లా టౌన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ వస్తుంది. ఈ కేసులో అప్పటికే అరెస్టైన ఒక మెజీషియన్ ని విచారిస్తాడు. అతని తప్పు లేదని వదిలేసి, మళ్ళీ దర్యాప్తు మొదలుపెడతాడు. మొదట అది సాధారణ కిడ్నాపింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకోపక్క బారాముల్లాలో పిల్లల అదృశ్యం కేసులు పెరిగిపోతూ ఉంటాయి. రిద్వాన్ ఇంటికి వచ్చాక వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. ఇంట్లో అర్ధరాత్రి సౌండ్స్, షాడోస్ కదలడం వంటివి జరుగుతాయి. రిద్వాన్ ఈ కేసును డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, బరముల్లా పాత హిస్టరీ బయటపడుతుంది.
Read Also : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ
కాశ్మీర్ పండిట్స్ ను దారుణంగా చంపిన కేసులు, లోకల్ పాలిటికల్ లీడర్స్ కవరప్ చేసిన సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు రిద్వాన్ ఫ్యామిలీ ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంది. ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా రిద్వాన్ ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్‌లో జరిగిన సంఘటనలను బయటపెడతాడు. ఫైనల్‌లో పిల్లల మిస్సింగ్ కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? మిస్సింగ్ పిల్లలు ఎక్కడ ఉన్నారు ? దెయ్యాలు నిజమా లేక మనుషులు క్రియేట్ చేసినవా ? రిద్వాన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలు తెలుసుకోవాలనే టెన్షన్ ఆడియన్స్ లో కూడా పెరుగుతుంది. మరి ఈ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీని ఇప్పుడే చూసేయండి.