Bigg Boss 9 Telugu Day 62 : బిగ్ బాస్ ఎపిసోడ్ 63లో ‘శివ’ మూవీ రీరిలీజ్ ప్రమోషన్స్ తో పాటు రామూ రాథోడ్ షాకింగ్ ఎలిమినేషన్, కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీ కూడా ఆసక్తికరంగా సాగింది. ఎవరు ఎవరి కోసం ఏం త్యాగం చేశారో తెలుసుకుందాం పదండి.
కల్ట్ క్లాసిక్ ‘శివ’ మూవీ రీరిలీజ్ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున, అందులో హీరోయిన్ గా నటించిన నాగ్ సతీమణి అమల బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. హౌస్ మేట్స్ కూడా జంటలుగా ఈ సినిమాలోని సాంగ్స్ కు పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టారు. అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో హౌస్ మేట్స్ ముచ్చటించారు. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలు ఉంటే తాను కూడా బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళడానికి సిద్ధం అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు వర్మ. కాగా 36 ఏళ్ల క్రితం విడుదలైన ‘శివ’ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఈ సీజన్లో హిట్, ఫ్లాప్ కంటెస్టెంట్స్ ను తేల్చే పనిని ఆడియన్స్ కు అప్పగించారు. ఈ లిస్ట్ లో సుమన్ శెట్టి, ఇమ్మూ, తనూజా, కళ్యాణ్, రీతూ, డెమోన్, గౌరవ్, రామూ, నిఖిల్, సంజన, భరణి వరుసగా నెంబర్ 1 నుంచి టాప్ 11 స్థానాల్లో ఉన్నారు. 100% పాజిటివ్ ఓటింగ్ లో టాప్ లో ఉన్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. అతనికి డైరెక్ట్ కంటెండర్ ఛాన్స్ ఇచ్చారు. కానీ అది కావాలంటే భరణి ఫ్యామిలీ వీక్ ను త్యాగం చేయాలి అంటూ మెలిక పెట్టారు. ఆ తరువాత స్థానంలో నిలిచినా ఇమ్మూకు అతని గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ ఉందని, కానీ అది కావాలంటే గౌరవ్ కు ఉన్న గోల్డెన్ బజర్ పవర్ ను త్యాగం చేయాలని అడిగారు. ఇమ్మూ సెల్ఫిష్ గా గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ ను కోరాడు. ఆ నోట్ విన్న తరువాత గౌరవ్ – ఇమ్మూకి మధ్య రచ్చ మొదలైంది. అలాగే తనూజాకు రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న తన సిస్టర్ వాయిస్ నోట్ – అది కావాలంటే కళ్యాణ్ నెక్స్ట్ కెప్టెన్ అయినా నామినేషన్లలోకి రాకుండా ఇమ్యూనిటీ ఉండబోదని తేల్చారు. రీతూకి ఆమె తండ్రి షర్ట్ కావాలంటే సంజన శారీస్ ను స్టోర్ రూమ్ లో పెట్టాలని మెలిక పెట్టారు. రీతూ దానికి ఒప్పుకుని తండ్రి షర్ట్ ను సొంతం చేసుకుంది.
రామూ రాథోడ్ ఎందుకు డల్ గా ఉంటున్నావు? నువ్వు చెప్తేనే నీ మనసులోని మాట మాకు అర్థం అవుతుంది అని అడిగారు నాగ్. “తిన్నా తీరం పడుతలే” అంటూ పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చిన్నప్పుడు కూలీ కోసం తన తల్లిదండ్రులు తనను ఐదేళ్లు వదిలి వెళ్లిపోయారని, ఇప్పుడు వాళ్ళను చూసుకునే స్టేజ్ లో ఉన్న తాను ఇన్ని రోజులు ఇలా దూరంగా ఉన్నాను అంటూ బాధ పడ్డాడు. సెల్ఫ్ ఎవిక్షన్ కు రామూ సిద్ధపడడంతో నాగ్ గేట్లు ఓపెన్ చేసి, రామూను బయటకు పంపాడు.
Read Also : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా