Shraddha Srinath (Source: Instagram)
చాలామంది హీరోయిన్లకు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తుంటాయి. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ కూడా అలాగే ఆఫర్లు అందుకుంటోంది.
Shraddha Srinath (Source: Instagram)
గతేడాది తను నటించిన రెండు తెలుగు సినిమాలు ఫ్లాపే అయినా అది తన కెరీర్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు.
Shraddha Srinath (Source: Instagram)
ఇప్పటివరకు శ్రద్ధా శ్రీనాథ్ ఎక్కువగా యంగ్ హీరోలతోనే నటించింది. కానీ ‘సైంధవ్’తో తను సీనియర్ హీరోల సరసన కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది.
Shraddha Srinath (Source: Instagram)
ఇక ‘డాకు మహారాజ్’తో మరో సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రద్ధా.
Shraddha Srinath (Source: Instagram)
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. అంతే కాకుండా అందులో శ్రద్ధా లుక్స్, యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి.
Shraddha Srinath (Source: Instagram)
ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ చేతిలో పలు సినిమాలు ఉన్నా కూడా వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు.
Shraddha Srinath (Source: Instagram)
ప్రస్తుతం శ్రద్ధా.. ‘ఆర్యన్’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది.
Shraddha Srinath (Source: Instagram)
శ్రద్ధా యాక్టింగ్‌కు ఫిదా అయిన చాలామంది తెలుగు మేకర్స్.. తనను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Shraddha Srinath (Source: Instagram)
మొత్తానికి కన్నడ సినిమాలతో పాపులర్ అయిన శ్రద్ధా.. ప్రస్తుతం సౌత్ భాషలు అన్నీ దాదాపుగా కవర్ చేసే పనిలో పడింది.