Reliance JioCoin : క్రిప్టో రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో వ్యాపార సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టింది. దీంతో భారత్ కూడా క్రిప్టో కరెన్సీ (Crypto Currency)ని మెుదలు పెట్టిన దేశాల జాబితాలో చేరింది. అయితే అసలు జియో కాయిన్ (JioCoin) అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
భారత్ లో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో తాజాగా JioCoinను పరిచయం చేసింది. JioCoinను బ్లాక్‌చెయిన్ టెక్-పవర్డ్ ఎకోసిస్టమ్‌తో ఏకీకృతం చేసి ఇండియాలో డిజిటల్ లావాదేవీలలో పెను మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని యుటిలిటీ టోకెన్‌గా కూడా పిలుస్తున్నారు. ఇది జియో డిజిటల్ సేవలు, డేటా స్టోరేజ్, ఈ-కామర్స్ స్టోరేజ్ ను తిరిగి పొందగలదని కూడా తెలుస్తుంది.
JioCoin ఎలా పని చేస్తుంది? –
JioCoinsను ప్రాథమికంగా బ్లాక్ చెయిన్ ఆధారిత రివార్డ్ టోకెన్‌లు. వీటిని భారతీయ యూజర్స్ తమ స్మార్ట్‌ఫోన్ నంబర్‌లలో జియో అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు పొందే ఛాన్స్ ఉంటుంది. JioCoin వినియోగదారుడి గోప్యతను రక్షించడంతో పాటు సురక్షితమైన లావాదేవీలను కూడా అందిస్తుంది. అయితే ఇప్పటివరకూ రిలయన్స్ జియో తమ జియో కాయిన్ కు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ప్రస్తుతం JioCoin బీటా టెస్టింగ్ మోడ్‌లో ఉంది. ఇది Jio బ్రౌజర్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ జియో కాయిన్స్ పొందటానికి వినియోగదారులు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి ఇందులో భాగంగా కేవలం ఇండియాకు చెందిన వ్యక్తి మాత్రమే కావలసి ఉంటుంది అంతేకాకుండా 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉండాలి. ఇంకా వినియోగదారులు BBRP ప్రోగ్రామ్ లేదా దాని అనుబంధ అప్లికేషన్‌లతో కూడా నమోదు చేసుకోవాలి.
JioCoinని సేకరించడానికి, వినియోగదారులు BAT (బ్రేవ్ బ్రౌజర్ కరెన్సీ) లో పాల్గొనాలి. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా ఈ టోకెన్‌లు వినియోగదారుల వెబ్3 వాలెట్‌లో క్రెడిట్ అవుతాయి. ప్రత్యేకమైన ఖాతాకు యాక్సెస్‌ను అందించడంతో పాటు అన్ని రివార్డ్‌లను జియో సేవలను పొందడానికి ఉపయోగించవచ్చు. దీన్ని రూపొందించడానికి, జియో పాలిగాన్ ల్యాబ్స్‌తో కలిసి పనిచేసింది.
ఇండియా క్రిప్టో మార్కెట్ –
మార్కెట్లో JioCoin అరంగేట్రం భారత్ లో క్రిప్టో వినియోగానికి ఆజ్యం పోసింది. ఇక క్రిప్టో భారతీయులకు పరిచయమయ్యేలా చేయడంలో రిలయన్స్ సహాయం చేస్తుంది. ఇక ఈ క్రిప్టో కరెన్సీకి రిలయన్స్ జియో ముకేశ్ అంబానీ రెండో కొడుకు ఆకాష్ అంబానీ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 50 మంది సభ్యుల బృందం Jio కాయిన్ ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మరి జియో తీసుకొచ్చిన ఈ క్రిప్టో కరెన్సీ తో మరిన్ని కంపెనీలు దేశంలో క్రిప్టో కరెన్సీని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి దేశీయ క్రిప్టో కరెన్సీ మొదలుకానున్న నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : జియో వర్సెస్ ఎయిర్ టెల్… రూ. 500 లోపు ప్లాన్స్ లో ఏది బెస్ట్ అంటే?