Shraddha Srinath (Source: Instagram)
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో ‘డాకు మహారాజ్’ కూడా ఒకటి. అందులో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు మరొక హీరోయిన్గా నటించింది శ్రద్ధా శ్రీనాధ్.
Shraddha Srinath (Source: Instagram)
స్టార్ హీరో స్టేటస్‌ను కాకుండా నచ్చే కథ, ప్రాముఖ్యత ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకొని కథలను ఎంపిక చేసుకునే హీరోయిన్స్‌లో శ్రద్ధా కూడా ఒకరు.
Shraddha Srinath (Source: Instagram)
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయ్యాయి. ఈ పదేళ్లలో 25 సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది శ్రద్ధా.
Shraddha Srinath (Source: Instagram)
కన్నడలో శ్రద్ధా మొదటి సినిమా ‘యూ టర్న్’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అలా కేవలం తన టాలెంట్‌తోనే మరిన్ని అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది.
Shraddha Srinath (Source: Instagram)
కేవలం కన్నడలోనే కాదు.. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది శ్రద్ధా శ్రీనాధ్.
Shraddha Srinath (Source: Instagram)
కెరీర్ మొదట్లోనే ఏడాదికి దాదాపు అరడజను సినిమాలను విడుదల చేస్తూ దూసుకుపోయింది శ్రద్ధా.
Shraddha Srinath (Source: Instagram)
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’తో మొదటిసారి నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Shraddha Srinath (Source: Instagram)
‘జెర్సీ’లో నాని నటనే హైలెట్‌గా నిలిచిన శ్రద్ధా శ్రీనాధ్ కూడా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చాలామంది ప్రేక్షకులు భావించారు.
Shraddha Srinath (Source: Instagram)
శ్రద్ధా నటన బాగుందని తెలుగు మేకర్స్ సైతం ప్రశంసించినా తనకు తెలుగులో తప్పా ఇతర సౌత్ భాషల్లో అవకాశాలు ఎక్కువయ్యాయి.
Shraddha Srinath (Source: Instagram)
గతేడాది.. అంటే 2024లో మాత్రమే బ్యాక్ టు బ్యాక్ రెండు తెలుగు సినిమాల్లో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
Shraddha Srinath (Source: Instagram)
2024లో శ్రద్ధా శ్రీనాధ్ ‘సైంధవ్’, ‘మెకానిక్ రాకీ’ లాంటి సినిమాలు విడుదలయినా ఆ రెండూ డిశాస్టర్లే అయ్యాయి.
Shraddha Srinath (Source: Instagram)
తాజాగా బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’లో హీరోయిన్గా నటించి మళ్లీ ట్రాక్‌లో పడింది శ్రధా శ్రీనాధ్.