Saif Ali Khan: మునుపెన్నడూ లేని విధంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి జరిగింది. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో దుండగులు పడడం చాలా కష్టం. టైట్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి. కానీ, వాటన్నింటిని దాటుకుని ఇద్దరు దొంగలు.. సైఫ్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఇద్దరు దొంగలు సైఫ్ ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడబోయారు. ఆ సమయంలోనే సైఫ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. కత్తితో అతనిపై దాడికి పాల్పడ్డారు.
ఇక దాడి అనంతరం సైఫ్ అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన కొడుకు ఇబ్రహీం రక్తంతో ఉన్న తండ్రిని చూసి వెంటనే హాస్పిటల్ కు తరలించాడు. ఒక ఆటోలో సైఫ్ ను తీసుకొని లీలావతి హాస్పిటల్ కు వెళ్లారు. సైఫ్ ను ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అదేంటి.. ఇంతపెద్ద సెలబ్రిటీలు .. వీరి ఇంట్లో ఒక్క కారు కూడా లేదా.. ? అనే అనుమానం నెటిజన్స్ నుంచి వస్తుంది.
సైఫ్ కు ఒకటి కాదు 5 లగ్జరీ కారులు ఉన్నాయి. కానీ, ఆయనను కారులో తీసుకువెళ్లకపోవడానికి కారణం.. అర్ధరాత్రి 3 గంటలు కావడం.. అందుబాటులో డ్రైవర్ లేకపోవడం ఒకటి అయితే.. కార్లు సెల్లార్లో ఉండడంతో వెంటనే వెళ్లి వాటిని తీసుకురాలేకపోయారట. పైనుంచి సైఫ్ ను కిందకు తీసుకొచ్చిన ఇబ్రహీం వెంటనే రోడ్డు మీదకు పరిగెత్తి అక్కడ కనిపించిన ఆటోను ఇంటికి తీసుకొచ్చి.. తండ్రిని హాస్పిటల్ కు తీసుకెళ్లారట.
Hari Hara Veeramallu : ‘మాట వినరా’ సాంగ్ కాపీ… తారక్ పాటను కాపీ కొట్టిన పవన్
అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే.. సైఫ్ ఇంట్లో చోరీ చేయాలనుకున్న ఇద్దరు దుండగులు ముసుగులు వేసుకొని.. ముందురోజే సైఫ్ ఇంట్లో దాక్కున్నారు. ఇక అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సైఫ్ చిన్న కొడుకు జేహ్ రూమ్ లోకి చొరబడ్డారు. వారిద్దరిని చూసిన జేహ్ కేర్ టేకర్ గట్టిగ కేకలు వేయగా.. సైఫ్ ఆ రూమ్ లోకి వచ్చాడు . వెంటనే దుండగులు సైఫ్ ను చూసి భయపడి అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సైఫ్ కు ఆరుచోట్ల గాయాలయ్యాయి.
ఇక సైఫ్ ను కొడుకు ఇబ్రహీం వెంటనే లీలావతి హాస్పిటలకు తరలించడం జరిగింది. సైఫ్ కు సర్జరీ చేసిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ దాడి మొత్తం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకోనున్నట్లు తెలిపారు.