Shobana (Image Source: Instagram)
సీనియర్ నటి శోభన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతేడాది రిలీజ్ అయిన కల్కి2898AD సినిమాతో తెలుగులో శోభన రీఎంట్రీ ఇచ్చింది.
Shobana (Image Source: Instagram)
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలిగా శోభన విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Shobana (Image Source: Instagram)
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న శోభన.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోని స్టార్ హీరోస్ తో కలిసి నటించి మెప్పించింది.
Shobana (Image Source: Instagram)
తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 కి పైగా చిత్రాలలో నటించి మెప్పించిన శోభన రెండుసార్లు జాతీయ అవార్డును అందుకుంది.
Shobana (Image Source: Instagram)
2006లో సినీరంగంలో శోభన చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక ఈ ఏడాది ఆమెను పద్మభూషణ్ వరించింది.
Shobana (Image Source: Instagram)(2)
1994లో శోభన కళార్పణ అనే సంస్థను స్థాపించింది. భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
Shobana (Image Source: Instagram)
ఇక శోభనా వయస్సు 54. ఇప్పటివరకు ఆమె వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఇక పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగిన ప్రతిసారి ఆమె దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే.. " నాకు పెళ్లి మీద నమ్మకం లేదు.. పెళ్లి చేసుకుంటే మనకు ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది" అని చెప్పుకొస్తుంది.
shobhana
ప్రస్తుతం ఒకపక్క డ్యాన్స్ స్కూల్ నడుపుతూ.. ఇంకోపక్క మంచి సినిమాలను ఎంచుకుంటూ శోభన బిజీగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటూ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.