BigTV English
Advertisement

Mazaka : ‘మజాకా’కు క్రేజీ డీల్… సందీప్ కిషన్ కెరీర్ లోనే హయ్యెస్ట్

Mazaka : ‘మజాకా’కు క్రేజీ డీల్… సందీప్ కిషన్ కెరీర్ లోనే హయ్యెస్ట్

Mazaka : యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రస్తుతం ‘మజాకా’ (Mazaka) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సందీప్ కిషన్ కెరీర్లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ రైట్స్ డీల్ జరిగిందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.


‘మజాకా’కు క్రేజీ డీల్
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా ‘మజాకా’ (Mazaka) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మజాకా’ అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మూవీలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మహా శివరాత్రి వీకెండ్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లు దాటిందని సమాచారం. దాదాపు 33 కోట్లతో మూవీ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అయితే రిలీజ్ కు ముందే ‘మజాకా’ టీంకు భారీ డీల్ కుదిరింది.

జీ స్టూడియోస్ ‘మజాకా’ నాన్-థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 20 కోట్లకు సొంతం చేసుకుందనేది తాజాగా అందుతున్న సమాచారం. సందీప్ కిషన్ సినిమాకు ఇది భారీ డీల్ అనే చెప్పాలి. అంతేకాదు ఇదే ఆయన కెరీర్ లో హయ్యెస్ట్ డిజిటల్ డీల్. ఇక మేకర్స్ ఇప్పుడు 13 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే చాలు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చినట్టే. ఇతర నాన్-థియేట్రికల్ రైట్స్ డీల్ కూడా ఇలాగే ఫ్యాన్సీ ధరకు సెట్ అయితే నిర్మాతలు సేఫ్ జోన్ లో పడతారు.


‘మజాకా’ (Mazaka) సినిమా అంచనాలను అందుకుని, డీసెంట్‌గా థియేట్రికల్ రన్ ముగిస్తే మేకర్స్‌కి మంచి లాభాలు వస్తాయి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ మంచి బజ్‌ ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మజాకా ఫిబ్రవరి 21న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

సందీప్ కిషన్ ఆశలన్నీ ‘మజాకా’పైనే…
సందీప్ కిషన్ నుంచి సోలో సినిమా వచ్చి ఏడాది కావస్తోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న ఈ హీరో ‘ఊరు పేరు భైరవకోన’ మూవీతో ట్రాక్ లో పడ్డాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ హీరో వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో ‘మజాకా’ (Mazaka) కూడా ఒకటి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొడతానననే నమ్మకంతో ఉన్నారు సందీప్. ఇక ఈ హీరో నెక్స్ట్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఓ మూవీతో పాటు, మరో మూవీని కూడా లైన్ లో పెట్టాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×