Jio : భారత్లోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ జియో.. ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ ప్లాన్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో జియో వినియోగదారులు వేరే నెట్వర్క్స్ కు మారిపోతున్న నేపథ్యంలో జియో కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అతి తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ ను అందిస్తూ యూజర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్లిమిటెడ్ 5G డేటా ప్లాన్ ను అతి తక్కువ ధరకే తీసుకొచ్చేసింది.
అధిక డేటాతో అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కోసం జియో సరి కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చేసింది. రూ. 200 లోపే బెస్ట్ డేటా ప్లాన్ తీసుకొచ్చేసింది. మరి.. అసలు ఈ ప్లాన్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Jio Rs.198 Prepaid Plan –
తక్కువ ధరకే డేటా ఎక్కువగా ఉపయోగించే యూజర్స్ కు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్
అపరిమిత కాలింగ్ – అన్ని నెట్‌వర్క్‌లలో అంతరాయం లేని వాయిస్ కాల్‌లను ఆస్వాదించండి.
రోజువారీ డేటా పరిమితి – రోజుకు 2GB డేటాను పొందొచ్చు. బ్రౌజింగ్, స్ట్రీమింగ్ తో పాటు మరెన్నో ఆఫ్షన్స్
రోజువారీ SMS – రోజూ 100 SMS
అదనపు ప్రయోజనాలు – JioTV , JioCinema, JioCloud వంటి Jio యాప్‌లకు యాక్సెస్
అపరిమిత 5G ప్రయోజనాలు – అపరిమిత 5G డేటా ఉంటుంది. ఇది Jio ప్రత్యేకంగా 2GB రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లపై అందిస్తుంది.
చెల్లుబాటు – 14 రోజులు
మొత్తం డేటా – 28GB
Jio Rs.349 Prepaid Plan –
ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో 56 GB డేటా ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా డేటా వినియోగం అవసరమయ్యే వినియోగదారులు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.
ఇక జియో రూ.198 ప్లాన్ రూ.349 ప్లాన్స్ లో ఏది బెస్ట్ అంటే స్వల్పకాలిక ప్రయోజనాలు కావాలనుకునే యూజర్స్ రూ.198 ప్లాన్ ఎంచుకోవచ్చు. అదే దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలనుకునే యూజర్స్ రూ. 349 ప్లాన్ ఎంచుకోవచ్చు.
రోజువారి అదనపు డేటా ప్లాన్స్ ను సైతం జియో మార్చివేసింది. ఇందులో భాగంగా రూ.19 డేటా ప్లాన్ 1GB డేటా ఒక్కరోజు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇక రూ. 29 ప్లాన్ ను పరిమిత డేటా వినియోగంతో రెండు రోజుల వ్యవధిలో అందిస్తుంది. జియో తీసుకొచ్చిన ఈ మార్పులతో వినియోగదారుల డేటాను తక్కువ సమయంలోనే వినియోగించాల్సి ఉంటుంది
ఇక జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ అతి తక్కువ ధరకే బెస్ట్ డేటా సదుపాయం కావాలనుకునే యూజర్స్ ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు వినియోగదారులకు అవసరమైన అన్లిమిటెడ్ కాల్స్, మెసేజెస్ ను కూడా అందిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ కోసం జియో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ను అందిస్తుంది. ఇక డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్స్ బెస్ట్ ఆఫ్షన్.
ALSO READ : Samsung Galaxy S25 Plus vs OnePlus 13 vs iPhone 16 Plus : ఈ మెుబైల్స్ లో ఏది బెస్ట్..!