CM Revanth Reddy – Tollywood: అసెంబ్లీలో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో సినీ ప్రముఖులంతా దీనితో పాటు పలు ఇతర అంశాలపై చర్చించడానికి సీఎంతో భేటీ అయ్యారు.
పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలతో పాటు వెంకటేశ్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా రేవంత్ రెడ్డితో మీటింగ్‌కు హాజరయ్యారు.
సినీ ప్రముఖులు తమ సమస్యలను, అభిప్రాయాలను చెప్పగా ప్రభుత్వం తరపున ఉన్న అభియోగాలను రేవంత్ రెడ్డి వినిపించారు.
బెనిఫిట్ షోలకు రేవంత రరెడ్డి అనుమతి ఇచ్చారు కానీ కండీషన్స్ అప్లై అని స్పష్టంగా చెప్పారు. సినీ ప్రముఖుల రిక్వెస్ట్‌తో బెనిఫిట్ షోలు వద్దనే మాటను ఆయన వెనక్కి తీసుకున్నారు.
సంధ్య థియేటర్ ఘటన అందరినీ బాధించింది అంటూ సినీ ప్రముఖులు తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తే బాగుంటుందని కోరారు.
దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించడం చాలా సంతోషంగా ఉందంటూ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. అసలైతే ఈ మీటింగ్ జరగడానికి దిల్ రాజునే ముఖ్య కారణంగా మారారు.
టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన కే రాఘవేంద్ర రావు.. సీఎం రేవంత్ రెడ్డికి పూల బొకే అందిస్తూ ఫోటోలు దిగారు.
సీనియర్ హీరో నాగార్జున.. సీఎం రేవంత్ రెడ్డికి షాలువా కప్పి ఆయనతో ఫోటో దిగారు.
సీనియర్ హీరో వెంకటేశ్ కూడా రేవంత్ రెడ్డితో ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.