OTT Movie : కన్నడ ఇండస్ట్రీలో రాజ్ బి షెట్టికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇతను నటించిన సినిమాలలో ఒక్కటి చూసినా ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయట పెట్టాడు రాజ్. ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. టోబి అనే ఒక మూగ పాత్రలో జీవించాడానే చెప్పుకోవాలి. ఒక బీస్ట్ గా ఉండే టోబి తన దత్తపుత్రిక జెన్నీ కోసం మారాలనుకుంటాడు. అయితే స్టోరీ మరోలా నడుస్తుంది. రివేంజ్ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు, ముఖ్యంగా రాజ్ బి షెట్టి అభిమానులకు మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.
‘టోబి’ (Toby) 2023లో వచ్చిన కన్నడ యాక్షన్ మూవీ. బేసిల్ అల్చలక్కల్ దర్శకత్వంలో రాజ్ బి షెట్టి మెయిన్ రోల్ లో నటించగా, సమ్యుక్త హొర్నాడ్, చైత్ర జె అచార్, రాజ్ దీపక్ షెట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఆగష్టు 25న థియేటర్లలోరిలీజ్ అయింది. ప్రస్తుతం. సోనిలివ్ (SonyLIV)లో కన్నడ ఒరిజినల్ వెర్షన్‌ను తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.155 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.2/10 రేటింగ్ ని పొందింది.
ఉత్తర కన్నడ జిల్లాలోని కుమ్టా టౌన్‌లో టోబి (రాజ్ బి షెట్టి) అనే మూగ వ్యక్తి మోర్చురీలో పని చేస్తూ ఒంటరిగా జీవిస్తుంటాడు. ఊరు వాళ్లు అతడ్ని బీస్ట్ అని పిలుస్తుంటారు. అతన్ని చూస్తేనే అందరూ భయపడుతుంటారు. అతను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు. అతనికి కోపం కూడా ఎక్కువే. ఎవరి మాట వినడు. ఒక రోజు అతను అనాథ శిశువు జెన్నీని దగ్గరకు తీసుకుని పెంచుతాడు. అతనికి సావిత్రి అనే సె*క్స్ వర్కర్‌తో లవ్ డెవలప్ అవుతుంది. డామోదర్ అనే వ్యక్తి ఫ్రెండ్‌షిప్‌తో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ టోబిని ఆ ఊరి పెద్ద ఆనంద్ తన అక్రమ పనులకు ఉపయోగించుకుంటాడు. ఈ సమయంలో జెన్నీకూడా పెద్దది అవుతుంది. ఆనంద్ జెన్నీపై కన్ను వేస్తాడు. జెన్నీని బలవంతం చేసి ఆమె లైఫ్‌ని డిస్ట్రాయ్ చేస్తాడు. అతనితో పాటు అతని అనుచరులు కూడా ఈ దుర్మార్గంలో పాలు పంచుకుంటారు. ఆ తరువాత ఆమెను మర్డర్ చేస్తారు.
Read Also : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ