Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే మళ్లీ హరీష్ శంకర్ కు రవితేజ దర్శకుడుగా మరో అవకాశం ఇచ్చాడు. అప్పుడు చేసిన మిరపకాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ అయినా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూసిన సక్సెస్ గబ్బర్ సింగ్ రూపంలో వాళ్లకు దక్కింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ ప్రాజెక్ట్. చాలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ సినిమా వాయిదా పడటానికి మెయిన్ కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అప్పట్లో కథనాలు కూడా వినిపించాయి.
కేవలం త్రివిక్రమ్ ఆపడం వలన ఈ సినిమా డిలే అవుతుంది అని చాలామంది మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమాకి తప్ప పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలకి డేట్స్ ఇవ్వడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అందరూ అనుకునేవారు. ఇక నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ ఒక ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో త్రివిక్రంతో హరీష్ శంకర్ ఉన్న క్లోజ్నెస్ చూస్తే అప్పట్లో వచ్చిన వార్తలన్నీ కూడా అబద్ధాలే అని అనిపిస్తుంది.
https://Twitter.com/harish2you/status/1986766150651527287?t=VfLyzTa07UEl7W5w0IGqiQ&s=19
గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ హరిశంకర్ చాలా బాగా రాశాడు చాలా బాగా తీశాడు అని ప్రశంసలు కురిపించాడు త్రివిక్రమ్. ఆ సినిమా అయిపోయిన తర్వాత కారులో వెళ్తున్న టైంలో మీరు ఒరిజినల్ సినిమా నుంచి మదర్ క్యారెక్టర్ కి వాడిన ఇన్ హిల్లర్ తప్ప ఇంకేమి తీసుకోలేదు.
దానికోసం అన్ని లక్షలు పెట్టి రైట్స్ కొనడం ఎందుకు అని హరీష్ శంకర్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన కాంప్లిమెంట్ బాగా నచ్చింది అని పలు సందర్భాల్లో హరీష్ చెప్పాడు. అలానే నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్స్ గురించి ఎలివేట్ చేశాడు హరీష్. స్వతహాగా హరీష్ శంకర్ కూడా రైటర్ కావడంతో త్రివిక్రంలోని రచయితను బాగా ఇష్టపడుతుంటాడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: SSMB29 : రాజమౌళి కాపీ కొట్టడం మానలేదా? ఏంటి జక్కన ఇది?