Akhanda Thaandavam Promo: నందమూరి బాలకృష్ణ (Balakrishna)బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ 2(Akhanda 2). డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు తాజాగా ఈ సినిమా నుంచి అఖండ తాండవం (Akhanda Thaandavam) అనే పాటకు సంబంధించిన ప్రోమో విడుదల. అఖండ ఫస్ట్ సింగిల్ నవంబర్ 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు ఈ పాటకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో నిజంగానే బాలయ్య శివతాండవం చూపించారని స్పష్టం అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా బాలయ్య రౌద్రంతో శివతాండవం చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా సనాతన ధర్మాన్ని కాపాడుకొనే నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో శివ భక్తుడిగా కనిపించగా మరో పాత్రలో ఎమ్మెల్యేగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే తాజాగా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాలయ్య కెరియర్లో మొదటిసారి అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు హిందీలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉండటమే కాకుండా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుందని తెలుస్తోంది.
థియేటర్లలో శివతాండవమే..
ఈ సినిమా విడుదలకు సర్వం సిద్ధం అయిందని ఇక ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అఖండ 2 లో బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యతో ఆది పినిశెట్టి (Aadi Pinishetty) తలపడుతున్న సంగతి తెలిసిందే. విలన్ పాత్రలో ఆదిశెట్టి కనిపించబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మరిన్ని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక డిసెంబర్ 5వ తేదీ థియేటర్లలో శివతాండవమే అని తాజాగా సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది.
Also Read: Rashmika -Vijay’s wedding: పెళ్లి పనులలో బిజీగా రష్మిక.. పెళ్లి వేదిక అక్కడే?