ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణాకు సంబంధించి ఎన్నో క్రేజీ, వింతలు విశేషాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, పోలాండ్ లోని వార్సాలో ఓ ఆసక్తికర రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం. రన్నింగ్ బస్సు, ట్రామ్ లేదంటే మెట్రోలో పుట్టిన పిల్లలకు జీవితాంతం ఫ్రీ జర్నీ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ సరదా రూల్ ను వార్సా ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (WTp) తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక పిల్లలు నగరం చుట్టూ ప్రయాణించడానికి జీవితకాల పాస్ పొందేలా చేస్తుంది.
వార్సాలో సిటీ బస్సు, ట్రామ్, మెట్రోలో జన్మించినట్లయితే, జీవితాంతం అన్ని ప్రజా సర్వీసులను ఉపయోగించి ఉచితంగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో బస్సులు, ట్రామ్ లు, మెట్రో, SKM, WKD లాంటి కొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా జోన్ 1, జోన్ 2 ఉన్నంత వరకు ఈ రూల్ అందుబాటులో ఉంటుంది. ఈ నిబంధన చాలా సంవత్సరాలుగా అమల్లో ఉంది. ఈ ఉచిత రైడ్ పొందడానికి, వార్సా సిటీ కార్డ్ అనే ప్రత్యేక కార్డ్ అవసరం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో జర్నీ చేస్తున్న సమయంలో పుట్టారని నిరూపించే బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే, ఈ కార్డును అందిస్తారు.
ప్రజా రవాణాలో జన్మించిన వారికి ఉచిత ప్రయాణ అవకాశం వార్సాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ బుడాపెస్ట్, హంగేరీ: బుడాపెస్ట్ లో కూడా బస్సు, ట్రామ్, మెట్రోలో జన్మించిన వారికి జీవితాంతం ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఉన్నప్పుడు జన్మించినట్లు బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే ప్రత్యేక పాస్ అందిస్తారు. దీనిని చూపించి ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు. ఈ నియమం 2000ల ప్రారంభంలో ప్రారంభమైంది.
Read Also: జపాన్ Gen Z.. సె*క్స్ చేయరట, పాతికేళ్లు వచ్చినా ఆ అనుభవానికి దూరం, ఎందుకంటే?
⦿ లండన్, UK: లండన్ లో ట్యూబ్ రైలు, బస్సు, ఓవర్ గ్రౌండ్ లో జన్మించినట్లయితే, ట్రాన్స్ పోర్ట్ ఫర్ లండన్ జీవితాంతం ఉచిత ఓయిస్టర్ కార్డును ఇస్తుంది. ఈ కార్డు ఉన్న వాళ్లు అన్ని జోన్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది 1990 నుంచి అమల్లో ఉంది. లండన్ బిజీ రవాణా జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అవకాశంగా కొనసాగుతోంది.
⦿ కీవ్, ఉక్రెయిన్: కీవ్ లో మెట్రో, బస్సులలో జన్మించిన వారికి జీవితాంతం ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుంది. ఉక్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన 1990లలో ఈ నియమం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది.
ప్రజా రవాణా గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి ఆయా ప్రభుత్వాలు. ముఖ్యంగా నగరాలు కాలుష్య రహితంగా మార్చడమే లక్ష్యంగా ఈ రూల్ అమలు చేయబడుతుంది.
Read Also: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!