BigTV English

Influenza H5N1 : 2025లో పొంచి ఉన్న అతిపెద్ద మహమ్మారి.. పక్షులు, పాడి పశువు, మనుషుల్లో వేగంగా వ్యాప్తి

Influenza H5N1 : 2025లో పొంచి ఉన్న అతిపెద్ద మహమ్మారి.. పక్షులు, పాడి పశువు, మనుషుల్లో వేగంగా వ్యాప్తి

Influenza H5N1 | కరోనా మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. కోవిడ్ వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. అప్పటి నుంచి చాలా మంది ప్రజలు భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు ఏ రూపంలో వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహమ్మారి వ్యాధులు.. వైరస్, ఫంగస్, పారాసైట్, బ్యాక్టీరియం రూపాల్లో ఉంటుంది.


అయితే సరైన సమయానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు తీసుకురావడంతో కోవిడ్ తీవ్రత తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ వైద్య రంగంలో మూడు ప్రధాన వ్యాధులను సీరియస్ గా పరిగణిస్తారు. వీటిలో మలేరియా (పారాసైట్), హెచ్‌ఐవి (వైరస్), ట్యూబర్ కులోసిస్ (బ్యాక్టీరియం) ఉన్నాయి. ఈ మూడు వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. వీటికితోడు కొన్ని వైరస్ లు తమ స్వరూపం మార్చుకొని తీవ్రంగా ముటేషన్ చెందుతున్నాయి. వైరస్ లకు విరుగుడుగా శాస్త్రవేత్తలు యాంటివైరల్స్, యాంటిబయోటిక్స్ కనిపెట్టినా.. ఈ యాంటిబయోటిక్స్ ని కొన్ని వైరస్ లు తట్టుకొని తీవ్ర మవుతున్నాయి. ఈ అంశాన్నే వైద్య నిపుణులు సీరియస్ గా పరిగణిస్తున్నారు.

ముఖ్యంగా తదుపరి మహమ్మారి రూపంలో కొన్ని వైరస్ లు మార్పుచెందేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో అతి ప్రమాదకంగా ఇన్‌‌ఫ్లుయెన్జా జాతి వైరస్ లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇన్‌‌ఫ్లుయెన్జా జాతి వైరస్ లలో మరో ఏడాది కాలంలో అంటే 2025లో ఒక ప్రత్యేక ఇన్‌‌ఫ్లుయెన్జా వైరస్ అతిప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. అదే ఇన్‌‌ఫ్లుయెన్జా ఏ ఉప రకం H5N1 (influenza A subtype H5N1). దీన్ని బర్డ్ ఫ్లూ అని కూడా సామాన్య భాషలో పిలుస్తారు.


Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం

ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా పెంపుడు పక్షులు (కోళ్లు, బాతులు), అడవి పక్షుల్లో కనిపిస్తుంది. అయితే ఇటీవల ఈ బర్డ్ ఫ్లూ పాడిపశువులు (ఆవు, ఎద్దు, బర్రె), గుర్రాలక వ్యాపిస్తుడడంతో శాస్త్రవేత్తులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చాలా పాడిపశువులు చనిపోయాయి. మంగోలియా దేశంలో కూడా గుర్రాలు ఈ వైరస్ కారణంగా చనిపోయాయని తేలింది.

సాధారణంగా పక్షుల్లోనే ఇన్‌‌ఫ్లుయెన్జా కేసులు కనిపిస్తాయి. కానీ ఇవి ఇప్పుడు జంతువులకు వ్యాపించడంతో ఇకపై మనుషులకు ఎక్కువ సంఖ్యలో సోకే అవకాశం లేకపోలేదని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన 61 మంది (మనుషలు)ని గుర్తించారు. వారిలో ఎక్కువ మంది పౌల్ట్రీ (కోళ్ల ఫామ్), పాడిపశువుల పని చేసేవారే. పైగా జంతువుల పాలను పచ్చిగానే తాగేవారికి కూడా ఇది సోకింది.

2022, 2023 సంవత్సరాల్లో బర్డ్ ఫ్లూకు సంబంధించి కేవలం రెండు కేసులే ఉన్నాయి. కానీ 2024లో ఈ సంఖ్య 61కి చేరడంతో ఈ సమస్యను సీరియస్ గా పరిగణించాల్సిన అవసరముందని.. నిపుణుల సూచిస్తున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ సోకిన వారిలో 30 శాతం మంది చనిపోయారు.

కానీ బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకినట్లు రుజువు కాలేదు. కేవలం జంతువుల ద్వారానే సోకినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా పక్షుల నుంచే. ఎందుకంటే వ్యాధిని వ్యాపించే సియాలిక్ రిసెప్టార్స్ పక్షుల్లోనే ఎక్కువ. మనుషుల్లో ఈ సియాలిక్ రిసెప్టార్స్ పనిచేయవు. అయినా ఇంతటితో ప్రమాదం అంతరించలేదు. ఈ బర్డ్ ఫ్లూ మ్యూటేషన్ చెందితే మనుషుల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాలు దీన్ని నియంత్రించేందుకు సీరియస్ గా ప్రయత్నించాలి.

ఈ విషయంలో యూకె (బ్రిటన్) దేశ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. బర్డ్ ఫ్లూని నివారించేందుకు 50 లక్షల హెచ్ 5 (H5 vaccine) వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసింది. బర్డ్ ఫ్లూ నుంచి మనుషులు తప్పించుకునేందుకు ఈ హెచ్ 5 వ్యాక్సిన్ పనిచేస్తుంది. కానీ పక్షులు మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మార్గాలు ఇప్పటికైతే లేవు. దీంతో బర్డ్ ఫ్లూ విజృంభిస్తే.. ప్రపంచంలో ఆహార కొరత సమస్య వచ్చే ప్రమాదముంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×